ఈ బాల భీముడు వయస్సు 14... మరి బరువెంతో తెలుసా?

His age is 14 and weight is 150

11:50 AM ON 25th November, 2016 By Mirchi Vilas

His age is 14 and weight is 150

మనుషులు అనేకరకాలుగా వుంటారు. కొందరు తెల్లగా ఉంటే, మరికొందరు నల్లగా వుంటారు. ఇంకొందరు సన్నగా వుంటారు. అలాగే లావుగానూ వుంటారు. అయితే కొందరు భారీకాయంతో ఉండడం అక్కడక్కడా చూస్తాం. సరిగ్గా ఇక్కడ అలాంటి బాల భీముడు గురించి మనం చెప్పుకుంటున్నాం. వివరాల్లోకి వెళ్తే...

ఈ బాలుడి పేరు మహేష్ భూపతి. అందరూ చిన్నా అని పిలుస్తారు. వయస్సు 14 ఏళ్లు. బరువు మాత్రం 150 కేజీలు. అనంతపురం జిల్లా శింగనమల మండలం గోవిందరాయునిపేటకు చెందిన వడ్డే శ్రీరాములు, సులోచనల కుమారుడు మహేష్ భూపతి. ఇతగాడికి ఉదయం నిద్ర లేచింది మొదలు ఏదో ఒకటి తినాల్సిందే. లేదంటే ఆకలికి తట్టుకోలేడు. భర్త మరణంతో భార్య సులోచన బిడ్డతో పుట్టింటికి చేరింది. గ్రామంలో కూలి పనులు చేసుకుని బిడ్డను పోషించుకుంటోంది. రెండేళ్లవరకు మహేష్ అందరి పిల్లల్లాగే ఉన్నాడు. ఆ తరువాత అనూహ్యంగా బరువు పెరిగాడని తల్లి సులోచన అంటోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపింది. మహేష్ సరిగ్గా మాట్లాడలేడు. అమ్మ, ఆకలి అన్న మాటలు కూడా తడబడుతూ పలుకుతాడు. గోవిందరాయునిపేట గ్రామంలో మహేష్ భూపతిని దత్త పుత్రుడిగా చూసుకుంటారు. గ్రామంలో ఏ ఇంటికి వెళ్లినా ఏదో ఒకటి పెట్టి ఆకలి తీరుస్తారు. మరి ఎవరు ఇతనికి సాయపడతారో చూడాలి. ఇప్పటికే సోషల్ సైట్లలో ఇతని గురించి వార్తలు హల్ చల్ అవుతున్నాయి.

English summary

His age is 14 and weight is 150