హిట్లర్ ఆత్మహత్య చేసుకోలేదట - అది నాటకమేనట

Hitler Did Not Committed Suicide He Fled To Argentina

11:35 AM ON 19th January, 2017 By Mirchi Vilas

Hitler Did Not Committed Suicide He Fled To Argentina

జర్మన్ నియంత, రెండో ప్రపంచ యుద్ధానికి మూలకారకుడు అడాల్ఫ్ హిట్లర్ ఎప్పుడో చనిపోయినప్పటికీ అతని గురించి ఒక్కొక్క సంఘటన వెలుగుచూస్తూనే వుంది. తాజాగా మరో అంశం బట్టబయలు అయింది. అదేమిటంటే, బెర్లిన్ లోని ఓ బంకరులో ఆత్మహత్య చేసుకోలేదట. సీఐఏ మాజీ అధికారి బాబ్ బేర్ , అమెరికా ప్రత్యేక దళాల సార్జెంట్ టిమ్ కెన్నడీ ఈ విషయం స్పష్టం చేసాడు. బెర్లిన్ బంకరులో హిట్లర్ చావు నాటకం ఆడాడని, అక్కడి నుంచి అతడు వేరే దేశానికి పారిపోయాడని చెప్పారు. టిమ్ కెన్నడీ అల్ ఖాయిదా నేతలు ఒసామా బిన్ లాదెన్ , అబు అల్ -జర్కావీలను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించారు. బ్రిటీష్ గూఢాచారులు ఇచ్చిన ఓ నివేదికలో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్న ఒక్క రోజు ముందే అతడు బెర్లిన్ నుంచి రహస్యంగా లఫ్ట్ వ్యాఫ్ విమానంలో అర్జెంటీనా పారిపోయడని ఉంది. హిట్లర్ చివరి సారిగా ఉన్న బిర్లిన్ బంకరులోని ఐదో ద్వారం ఓ పెద్ద మైదానానికి దారి తీస్తోంది. ఈ మైదాన ప్రాంతం నుంచి ఎవరైనా సులభంగా పారిపోవచ్చు. అందుకే ఈ ద్వారం గుండానే హిట్లర్ పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అర్టెంటీనా వెళ్లేముందు డెన్ మార్క్ లో విమానం మారాడని, ఇక్కడ కొంతమంది హిట్లర్ ను చూశారని మరో నివేదికలో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వేలాది మంది నాజీలు జర్మనీ నుంచి అర్జెంటీనాకు వలస వెళ్లారు. హిట్లర్ కూడా అర్జెంటీనాకు వెళ్లడు అనడానికి ఇది కూడా ఓ బలమైన కారణమని భావిస్తున్నారు.

1945, ఏప్రిల్ 30న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడని సంకీర్ణదళాలు ప్రకటించాయి. వీరిద్దరి మృత దేహాలను బ్లాంకెట్స్ లో చుట్లి బంకర్ బయట ఓ గార్డెన్ లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. హట్లర్ , అతడి అనుచరుడు బ్రౌన్ లవి అని చూపించిన మృతదేహాలు వారివా, కావా అని చాలా ఏళ్లుగా సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. హిట్లర్ అవశేషాలుగా కేవలం దవడ మాత్రమే ఉంది. ఇది హిట్లర్ దే అని ఓ పరీక్షలో తేలింది. అయితే, ఈ పరీక్ష కూడా ఒక్క సారే చేయడం వల్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత హిట్లర్ ను చూశామని ఒక్కరూ తెలుపలేదు. మరోవైపు అర్జెంటీనాలో ఉన్న నాజీలు హిట్లర్ గురించి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి: ఆమిర్ ఖాన్ ఫోర్న్ టేప్ లీకయింది

ఇవి కూడా చదవండి: భార్యను చంపుతూ ఏం చేసాడో తెలుసా ?

English summary

One of the researcher made on Hitler shows that Hitler didn't committed suicide but he flew to Argentina and he says says that so many people saw Hitler in Denmark while changing the flight in those days.