హిట్లర్ రహస్య స్థావరాన్ని కనిపెట్టేసారు!

Hitler secret base found in Russia

12:17 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Hitler secret base found in Russia

హిట్లర్ పేరు చెప్పగానే ఓ నియంత గుర్తొస్తాడు. ఎవరైనా కొంచెం కఠినంగా వ్యవహరిస్తే చాలు హిట్లర్ తో పోల్చేస్తారు. అలాంటి హిట్లర్ ఆరోజుల్లో నిర్మించిన ఓ రహస్య స్థావరం బయటపడింది. ఉత్తర ధ్రువానికి దాదాపు వెయ్యికిలోమీటర్ల దూరంలో హిట్లర్ ఆదేశాల మేరకు నిర్మించిన ఓ రహస్య స్థావరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని అలెగ్జాండ్రా ల్యాండ్ వద్ద ట్రెజర్ హంటర్ పేరుతో వ్యవహరించే ఈ రహస్యప్రాంతాన్ని గుర్తించారు. ఇది ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న నిర్మానుష్యమైన ఒక దీవి. దాదాపు 500 వస్తువులు, బంకర్లు, వాడేసిన పెట్రోల్ క్యాన్లు, పేపర్ డాక్యుమెంట్లు ఇప్పటికీ అక్కడ భద్రంగానే ఉన్నాయి.

దీనిని 1942లో నేరుగా హిట్లర్ ఆదేశాల మేరకే నిర్మించినట్లు భావిస్తున్నారు. తర్వాత ఇది 1943 నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ 1944లో ఇక్కడికి ఆహార సరఫరా నిలిచిపోవడంతో విషపూరితమైన ఓ ఎలుగుబంటి కళేబర మాంసం తిని సిబ్బంది మృతి చెందారని డెయిలీ ఎక్స్ ప్రెస్ పేర్కొంది.

English summary

Hitler secret base found in Russia