హిట్లర్ రహస్య స్థావరం ఎక్కడో తెలుసా

Hitler Secret Base In Antarctica

10:47 AM ON 31st December, 2016 By Mirchi Vilas

Hitler Secret Base In Antarctica

ప్రపంచ నియంత హిట్లర్ పేరు తెలియని వారెవ్వరూ లేరు. వుండరు. ఎందుకంటే కఠినంగా వ్యవహరించేవాళ్లను, ఎవరిమాటా వినకుండా ఏకపక్షంగా పోయేవాళ్లను హిట్లర్ తో పోలుస్తూ వుంటారు. అలాంటి హిట్లర్ కి ఓ రహస్య స్థావరం ఉండేదని అంటారు. అంటార్కిటికాలో విల్కీస్ ల్యాండ్ అనే ధట్టమైన మంచుతో కప్పపడిన ద్వీపంలో నాజీల ‘యూఎఫ్ వో రహస్య స్థావరం’ ఉందని కొందరు పరిశోధకులు కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాధించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ అంటార్కిటికాలో యూఎఫ్ వో (ఎగిరే పళ్లాలు)ల కోసం ఓ రహస్య స్థావరాన్ని నిర్మింప చేశాడని యూఎఫ్ వో హంటర్లు పేర్కొంటున్నారు. దీని సంబంధించిన వివరాలను ‘సెక్యూర్ టీం10’ బృందం తమ యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోలో తెలిపారు.

‘‘అంటార్కిటికాలోని మంచు కింద ఏముందో ఇప్పటి వరకూ శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. ఈ రహస్యం ఏళ్లుగా కొనసాగుతూ వచ్చింది. అయితే, ఇటీవల అక్కడ కొన్ని మానవ నిర్మాణాల ఆనవాళ్లు కనిపించాయి. మంచు పర్వతాల పక్కన అక్కడక్కడ కొన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల రంధ్రాలు ‘ఎగిరే పళ్లెం’ ఆకారంలో ఉన్నాయి. వీటి గుండా వెళ్లాలంటే ఏదైనా ఎగిరే వస్తువుతోనే సాధ్యం. అది కూడా ఆ రంధ్రం ఆకారాంలోనే ఉండాలి’’ అని వారు వివరించారు. అయితే, ఈ రహస్య మార్గల గురించి అమెరికా నావికా దళం ‘మిషన్ హై జంప్ ’ పేరుతో రహస్యంగా పరిశోధనలు చేస్తోందని చెబుతున్నారు. అంటార్కిటికాలో జర్మన్ నాజీలు యూఎఫ్ వో స్థావరాన్ని నిర్మించారని, ఈ మార్గలు ఆ స్థావరానికి చెందినవేనని ప్రతిపాధిస్తున్నారు. భూ గర్భంలోని రహస్య లోకాలను కనుగొనేందుకు నాజీలు ఇక్కడ ఈ స్థావరాన్ని నిర్మించి ఉంటారని యూఎఫ్ వో అన్వేషకులు పేర్కొంటున్నారు. హిట్లర్ చనిపోయి చాలా కాలం అయినా అతని గురించి ఇంకా పరిశోధనలు జరగడం, అన్వేషణ చేయడం నిజంగా ఆశ్చర్యమే.

ఇది కూడా చూడండి: రెగ్యులర్ శృంగారం లేకుంటే ఎన్ని సమస్యలో తెలుసుకోండి

ఇది కూడా చూడండి: మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కల్గించే వస్తువులు ఇవే ... వెంటనే తీసేయండి..!

ఇది కూడా చూడండి: కలలు కలర్లో వస్తాయా..?

English summary

Hitler Secret Base In Antarctica.