హెచ్‌ఐవి లక్షణాలు

HIV symptoms

07:20 PM ON 14th December, 2015 By Mirchi Vilas

HIV symptoms

హెచ్‌ఐవి - హ్యూమన్‌ ఇమ్యూనో డెఫీషియన్సీ వైరస్‌. ఇది మానవ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఈ వైరస్‌ సిడి4 సెల్స్‌ని( టి సెల్స్‌ని) నాశనం చేస్తుంది. వైద్యపరంగా చికిత్స చేయించుకోకపోతే హెచ్‌ఐవి కాస్త ఎయిడ్స్‌గా మారుతుంది. ఇది తీవ్ర ప్రాణాంతకమైన వ్యాధి. ఎయిడ్స్‌ అంటే యక్వైర్డ్‌ ఇమ్యూనోడెఫీషియన్సీ సిండ్రోమ్‌. ఇది చాలా ఘోరమైన వ్యాధి. ఇది సాధారణంగా ఒకరి ఇంజక్షన్‌ వేరొకరికి వాడడం వలన లేదా లైంగిక సంబంధాల వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అందువల్ల జాగ్రత్త వహించాలి. ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు, డాక్టర్‌ని ఆశ్రయించినప్పుడు మీకు చేసే ఇంజక్షన్‌ కొత్తది అవునో కాదో చూసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రారంభ దశలోనే హెచ్‌ఐవి గుర్తించి చికిత్స పొందడం మంచిది. హెచ్‌ఐవి ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1/11 Pages

1. జ్వరం

ఇది అత్యంత సాధారణ ప్రాధమిక లక్షణం. హెచ్‌ఐవి ప్రారంభ దశలో ఉన్నప్పుడు జ్వరం పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇలా 2 నుండి 4 వారాలు కొనసాగుతుంది. అలాగే రాత్రి చెమటలు తరుచుగా పడుతుంటాయి. 77 శాతం మందిలో 62 శాతం రోగులకు జ్వరం ప్రాధమిక లక్షణంగా ఉంది. జ్వరం, హెచ్‌ఐవి ప్రారంభ దశల్లో ఉంది అనడానికి మంచి సంకేతం. ఈ వ్యాధి రోగనిరోధక శక్తిని  నశింపజేస్తుంది.

English summary

Early signs and symptoms of human immune deficiency virus. This virus destroys the CD4 cells, also called T cells.