మీరు ప్రాణాలతో తిరిగి రావాలంటే అక్కడకు వెళ్లొద్దు( వీడియో)

Hoia Baciu World's most haunted forest

12:02 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Hoia Baciu World's most haunted forest

అవునా! అంత డేంజరా.... అక్కడికి వెళ్తే ప్రాణం పోతుందా? అయితే ఓ సారి వివరాల్లోకి వెళ్ళాల్సిందే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మానవాతీత శక్తులు ఉంటాయని అంటారు కదా. ఇలాంటివి వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడమే గానీ వాస్త‌వంగా ఎవ్వ‌రూ అక్క‌డ‌కు వెళ్లి చూసి వ‌చ్చిన వారు ఉండ‌రు. అయితే అక్క‌డ జ‌రుగుతున్న కొన్ని సంఘటనలు కూడా దెయ్యాలున్నాయనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. అలాంటి ప్రాంతమే రొమానియోలో ఉంది. యూర‌ప్‌లోని రొమేనియా దేశంలోని హోయా బస్యూ అడవిలోకి వెళ్లిన వారు తిరిగి రావడం కష్టమని, ఒకవేళ అలా వస్తే, వాళ్లు సాధారణ వ్యక్తులు కారంటూ అక్కడి ప్రజలు చెప్పుకుంటుంటారు.

ఇది కూడా చదవండి: మూడు గంటలు పాటు ముద్దు పెట్టించుకున్న కాజల్

ఆ అడవిలో దెయ్యాలు తిరుగుతుంటాయని, లోపలికి వెళ్తే కాల్చుకు తింటాయని భయపడుతుంటారు. ఇక ఆ అడవి కూడా అంతే భయకరంగా ఉంటుందట. రొమానియా బెర్ముడా ట్రైంగిల్ అని పిలుచుకునే ఈ అడవిలో చాలా మంది కనపడకుండా పోయారట. కొన్ని విచిత్ర ఆకారాలు కనపడుతుంటాయని కూడా చెప్పుకుంటుంటారు. ఆ అడవిని చూడటానికి వచ్చిన పర్యాటకులతో స్థానికులు ‘మీరు ప్రాణాలతో బతికి బట్టకట్టాలంటే లోపలికి వెళ్లకండి’ అని చెబుతుంటారట. మిస్టీరియస్ వరల్డ్ సౌజన్యంతో ఆ అడవిలోని వింతలను మీరూ చూడండి.

ఇది కూడా చదవండి: రాజీవ్‌ కనకాల చెంప పగలగొట్టిన రష్మీ

నిజంగా అలా దెయ్యాలు అక్కడ వున్నాయో, లేదా ఎవరైనా ఎలా వ్యవహరిస్తూ, జనాన్ని భయంలో వుంచి, తమ పబ్బం గడుపుకుంటున్నారా? అనే కోణంలో కూడా ఆలోచించాలి కదా... ఏమైతేనేం అక్కడి వాళ్లు హడలి పోతున్నారు.

English summary

Hoia Baciu World's most haunted forest. The most haunted forest in Hoia Baciu. If anybody goes to this forest they will not come back.