హాలీవుల్ సింగర్ నటాలీ కోలె కన్నుమూత

Hollywood Singer Natalie Cole Dies

07:23 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Hollywood Singer Natalie Cole Dies

ప్రముఖ హాలీవుడ్‌ సింగర్, గ్రామీ అవార్డు గ్రహీత నటాలీ కోలె(65)కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటాలీ లాస్‌ఏంజిల్స్‌లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ.. డిసెంబర్‌ 31న తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో ఆమె లాస్‌ఏంజిల్స్‌లోని డిస్నీ హాల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె అనారోగ్యం కారణంగా ఆ ప్రదర్శన రద్దయింది. గాయనిగా.. పాటల రచయితగా నటాలీ మంచి పేరు సంపాదించారు. ఆమె పాడిన అన్‌ఫర్‌గెటబుల్‌ అనే ఆల్బమ్‌ ఆమెకు మంచి గుర్తింపునివ్వడమే కాక.. ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ ఆల్బమ్‌కే ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డును కూడా నటాలీ సొంతం చేసుకున్నారు. నటాలీ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

English summary

Hollywood Singer Natalie Cole, the award-winning singer and daughter of jazz legend Nat King Cole, has died.