గర్ల్ ఫ్రెండ్ ని చావబాదిన స్టార్ హీరో.. అరెస్ట్ చేసిన పోలీసులు!

Hollywood star hero beats his girlfriend

04:16 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Hollywood star hero beats his girlfriend

ఆ హీరో వెండితెరపై చూపించినట్టుగా గర్ల్ ఫ్రెండ్ పై తన ప్రతాపం చూపించాడు. తన ప్రేయసిపై పిడిగుద్దులు గుద్దాడు. అంతటితో ఆగకుండా ఆమె ముఖాన్ని పచ్చడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం పోలీసులకు దాకా వెళ్లడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కెడుతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా మీ డౌట్? ఇంకెందుకు మరి ఆలస్యం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం.. ఆ హీరో పేరు టామ్ సీజ్ మోర్. ప్రముఖ హాలీవుడ్ నటుడు. సేవింగ్ ప్రైవేట్ రియాన్, బ్లాక్ హాక్ డోన్ వంటి ప్రముఖ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..

లాస్ ఏంజెల్స్ లో ఉంటున్న ఈ హీరోకు ప్రియురాలు ఉంది. అయితే, మంగళవారం ఉదయం టామ్ ఇంటి నుంచి 911 నెంబర్ కు పదే పదే ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బాగా ఏడుస్తున్నట్లు కేకలు వినిపించాయి. ఫైటింగ్ జరుగుతున్న రేంజ్ లో చప్పుళ్లు వినిపించాయి. దీంతో, శరవేగంగా అక్కడికి పోలీసులు వెళ్లగా ఓ యువతిపై చేయి చేసుకుంటూ టామ్ కనిపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకు ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. తొలుత వాదులాడుకున్నవారు అనంతరం చేయిచేసుకునే వరకు గొడవ వెళ్లిందని గుర్తించారు.

తన ముఖంపైనా, తలపైన కొట్టాడని పోలీసులకు ఆమె చెప్పింది. గాయాలు కూడా బాగానే పైకి కనిపించాయి. అయితే, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె నిరాకరించింది. అయినప్పటికీ.. అతనిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి.. అతన్ని అరెస్టు చేశారు.

English summary

Hollywood star hero beats his girlfriend