రోబో-2 కి హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌!!

Hollywood technicians are selected for Robo-2 project

11:53 AM ON 3rd December, 2015 By Mirchi Vilas

Hollywood technicians are selected for Robo-2 project

దిగ్గజ దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం రోబో-2 ప్రీప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు కొన్ని వినిపిస్తున్నాయి. శంకర్‌ రోబో-2 ని హాలీవుడ్‌ ని తలదన్నేలా తీయాలన్నది అతని ప్లాన్‌. అందుకే ఏకంగా హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌నే తెచ్చేస్తున్నాడు. హాలీవుడ్‌ స్టార్‌హీరో 'ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌ నెగ్గర్‌' విలన్‌గా ఎంపికయ్యారు. బాహుబలి చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ సమకూర్చిన శ్రీనివాస్‌ మోహన్‌ ఈ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందిస్తున్నారు. నిరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా ఎంపికయ్యారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా 'లార్డ్స్‌ ఆఫ్‌దిరింగ్స్‌' చిత్రానికి మేకప్‌ మెన్‌గా పనిచేసిన 'సీన్‌ఫుట్‌'ని రోబో-2 కోసం ఎంపిక చేశారు. లుక్‌ టెస్ట్‌ కోసం అమెరికా వెళ్లిన రజనీకాంత్‌ పై ఇప్పుడు ఈయన మేకప్‌టెస్ట్‌ చేయనున్నారు. 'ఐ' చిత్రం కి పని చేసిన సీన్‌ పెన్‌ రోబో-2కి కూడా మేకప్‌ విభాగంలో పని చేయనున్నారు. హాలీవుడ్‌నే మించి పోయేలా శంకర్‌ టెక్నీషియన్స్ ని ఎంపిక చేశారు.

English summary

Hollywood technicians are selected for Robo-2 project. Hollywood Superstar Arnold Schwarzenegger is selected as villan in Robo-2.