బాహుబలి - 2 కోసం హాలివుడ్ విలన్ వస్తున్నాడా ?

Hollywood Villian To Act In Bahubali

05:39 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Hollywood Villian To Act In Bahubali

మినిమమ్ ... కాదు కాదు మాగ్జిమమ్ గ్యారంటీ .... అదేనండి సినీమాకి గ్యారంటీ గల దర్శకునిగా గుర్తింపు పొందిన ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల తీసిన ' బాహుబలి 'తో ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన తీయబోయే బాహుబలి సీక్వెల్ గురించి రకరకాల చర్చలు వినిపిస్తుంటే , వివిధ రకాల వార్తలూ వస్తున్నాయి. 2016లో బాహుబలి -2 వస్తుందని చెబుతున్నా , 2017కి గానీ రూపుదిద్దుకోదని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే అందరి అంచనాలను దాటేసి ‘బాహుబలి’ని రూపొందించిన రూపకర్త జక్కన్న ఇక బాహుబలి- 2 ని కూడా అంతేవాసిగా తెరకెక్కించే పనిలో నిమగ్న మయ్యాడు. ఈ చిత్రం కోసం టాప్ టెక్నిషీయన్స్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ నటుల్ని కూడా రంగంలోకి దింపుతున్నాడని బోగట్టా. ఇందులో భాగంగానే హాలీవుడ్ స్టార్ 'నాథన్ జాన్స్‌'ను ‘బాహుబలి-2’లో విలన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు పొక్కాయి. ఈమేరకు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇంతకీ నాథన్ జోన్స్ ధూమ్ రన్నర్స్, ట్రాయ్, టామ్ యుమ్ గూంగ్, ఫియర్‌లెస్, సోంటమ్‌తోపాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించడమే కాకుండా ‘భూలోగం’ అనే తమిళం సినిమాలో కూడా నటించాడు. జోన్స్ ప్రస్తుతం బాలీవుడ్‌లో టైగర్ ష్రాప్ హీరోగా నటిస్తున్న ఫ్లైయింగ్ జాబ్ సినిమాలో విలన్ నటిస్తున్నారు. ఆరడుగులపైన ఎత్తు..చూడగానే ఒణుకు పుట్టించేలా కండలు తిరిగిన దేహంతో ఉండేలా విలన్లను ఎంపిక చేసే రాజమౌళి , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న ‘బాహుబలి-2’ చిత్ర యూనిట్ డిసెంబర్ తొలి వారంలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్ళే పనిలో వున్నారని అంటున్నారు. 2016 చివరకల్లా ఈ సినిమాను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. లేని పక్షంలో 2017ప్రధమార్ధంలో విడుదల కావడం తధ్యం.

English summary

Hollywood Villian To Act In Bahubali