నడి రోడ్డు మీదే విషం తాగి చనిపోయిన హోంగార్డ్(వీడియో)

Home Guard Drinks Poison On Road In Secunderabad

11:31 AM ON 15th April, 2016 By Mirchi Vilas

Home Guard Drinks Poison On Road In Secunderabad

వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఆత్మహ్యత్యలకు పాల్పడడం సర్వ సాధారణంగా మారిపోయాయి. తాజాగా ఏంకష్టమొచ్చిందో.. ఏమో.. బాలరాజు అనే హోంగార్డ్ నడిరోడ్డుపై విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. మామూలుగా డ్రింక్ తాగుతున్నాడనుకొని జనం ఎవరి పనుల్లో వారున్నారు. గుడి ఎదురుగా చోటుచేసుకున్న ఈ ఘటన సిసిటివి కెమెరాలో రికార్డయింది. ఫుటేజ్ ప్రకారం ఎరుపు రంగు చొక్కాలో ఆలయం వద్దకు వచ్చిన బాలరాజు కొద్ది సేపు అటు ఇటూ తిరిగాడు.

ఇవి కూడా చదవండి: షిర్డీ సాయిని పూజించడం వలనే కరువు వచ్చిందట!

ఇంతలో ఒక మహిళ మాత్రం బాలరాజుని కలిసి వెళ్లింది. ఆ తర్వాత అతడు వెళ్లి కూల్ డ్రింక్ తెచ్చుకొని అంతకుముందే సిద్ధంగా పెట్టుకున్న పురుగుల మందుతాగి అందరూ చూస్తుండగా తాగి ఒక రేకు డబ్బాలోకి వెళ్లి అందులో చనిపోయాడు. గతంలో హోంగార్డు అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. హోంగార్డ్స్ సంక్షేమం కోసం ఒకప్పుడు ఎంతో కృషి చేసిన బాలరాజు ఇలా చనిపోవడం హోంగార్డులను కలచివేసింది. విషాదం అలుముకుంది.

ఇవి కూడా చదవండి:

అప్పట్లో పవన్ మొదటి సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?

బాద్ షా కి పాక్ మోడల్ బంపరాఫర్

పనికిరాని పాకిస్థానీ పిఎమ్ ను అమ్మేస్తున్నారట

English summary

A Home Gaurd Named Balaraju in Secunderabad Drinks Poison by mixing it in Cool and Commits suicide on road in Secunderabad. This was recorded in CC Camera.