మోకాలు నొప్పి తగ్గటానికి చిట్కాలు

Home remedies for knee pain

03:37 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Home remedies for knee pain

మోకాలు నొప్పి అనేది మోకాలి కీలు స్థిరంగా ఉండుట వలన వచ్చే ఒక సాదారణ వైద్య పరిస్థితి. ఈ పరిస్థితి వృద్ధులు,పెద్దలు,యువకులు ఇలా అందరిలోనూ సంభవిస్తుంది.  పురుషుల కంటే మహిళల్లో మోకాలు నొప్పులు ఎక్కువగా ఉంటాయి.

మోకాలు నొప్పి స్థానం మారవచ్చు. నొప్పి అనేది  మోకాలి కీలుతో కూడిన అస్థి నిర్మాణాలు (తొడ ఎముక, కాలి మరియు కాలి చీలమండ), మోకాలిచిప్ప లేదా స్నాయువులు మరియు మృదులాస్థి ఎక్కడైనా ఉండవచ్చు.

మోకాలు నొప్పి కారణంగా ఎముక నిర్మాణం బలహీనం అవుతుంది. అలాగే నొప్పి ఉన్న కాలిలో మోకాలి దృఢత్వం, గుర్తించదగ్గ వాపు, ఎరుపు, తిమ్మిరి మరియు నడవటానికి మరియు నిలబడటానికి కష్టంగా ఉంటుంది. మోకాలు నొప్పులను సులభంగా తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. ఐస్ ప్యాక్

మోకాలు మీద ఐస్ ప్యాక్ పెడితే నొప్పి మరియు వాపు చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది. ప్రభావిత ప్రాంతంలో ఐస్ ప్యాక్ పెట్టటం వలన రక్త నాళాలను బిగుతుగా చేసి, రక్త ప్రవాహాన్ని తగ్గించి వాపును తగ్గిస్తుంది. నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

* ఒక పలుచని టవల్ లో ఐస్ ముక్కలను వేసి చుట్టాలి.
* మోకాలు యొక్క ప్రభావిత ప్రాంతంలో పెట్టి పది నిముషాలు ఉంచాలి.
* ప్రతి రోజు రెండు సార్లు ఈ విధంగా చేస్తే నొప్పి తగ్గుతుంది.

English summary

These remedies are most helpful for mild to moderate pain caused by overuse, lack of use or improper training.