తల మీద చర్మం మీద మొటిమలను తగ్గించుకోవటానికి చిట్కాలు

Home remedies for Scalp acne

04:31 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Home remedies for Scalp acne

మొటిమలు అనేవి శరీరం, తల మీద చర్మం మరియు శరీరం యొక్క అనేక బాగాలపై కనపడతాయి. ఈ సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనపడుతుంది.

జుట్టు మీద  చనిపోయిన చర్మ కణాలు మరియు సిబం కలిసి తల మీద చర్మం మీద చర్మ రంద్రాలను మూసివేయటం వలన మొటిమలు ఏర్పడతాయి. ఈ మొటిమలకు హార్మోన్ల మార్పులు,అనారోగ్యకరమైన ఆహారం, అలెర్జీ, ఆర్ద్ర పరిస్థితులు, కాలుష్యం మరియు కొన్ని రసాయనాల కారణంగా ఏర్పడతాయి. అలాగే ఈ సమస్యకు ఒత్తిడి, అలసట మరియు నిస్పృహ కూడా కారణం అవుతాయి. ఈ సమస్యను వదిలించుకోవటానికి కొన్ని సహజ నివారణలు మరియు నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయటానికి సాధారణ చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1/10 Pages

1. టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ మోటిమలు మరియు ఇతర చర్మ సమస్యలను సమర్థవంతముగా నివారిస్తుంది. ఈ నూనెలో ఏంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మ రంద్రాలను డ్రై గా చేసి మొటిమలను తగ్గిస్తుంది.

*  రెండు స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెలో 5 చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలపాలి. ఈ మిశ్రమంతో తలకు మసాజ్ చేసి రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
* మనం రెగ్యులర్ గా వాడే షాంపూలో కొన్ని చుక్కల  టీ ట్రీ ఆయిల్ ని కలిపి జుట్టు శుభ్రం చేయటానికి ఉపయోగించాలి.
* కాటన్ బాల్ పై కొన్ని చుక్కల  టీ ట్రీ ఆయిల్ ని వేసి ప్రభావిత ప్రాంతంలో రుద్దాలి. ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.  ప్రతి రోజు ఈ విధంగా రెండు సార్లు చేయాలి.

English summary

We have listed about how to get rid of scalp acne. When the bacteria already on the scalp combine with dead skin cells and sebum, the pores get blocked, leading to an outbreak of acne.