గాట్లు, గీతలను నయం చేసే చిట్కాలు

Home remedies for scratches

06:36 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Home remedies for scratches

పెద్ద పెద్ద గాయాలు అయితే వెంటనే వైద్యం అందవలసిన అవసరం ఉంది. కానీ చిన్న చిన్న గీతలను సులభంగా సహజమైన ఇంటి నివారణలతో నయం చేసుకోవచ్చు. మచ్చలు మరియు అంటువ్యాధుల  అభివృద్ధి ప్రమాదం తగ్గించేందుకు గీతలను మరియు కోతలను శుభ్రంగా  మరియు పొడిగా ఉంచాల్సిన అవసరం ఉంది. మనకు వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్ధాలు గాట్లను నయం చేయటంలో సహాయపడతాయి. ఒకవేళ ఇంటి నివారణలతో నయం కాకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

1/11 Pages

1. వెల్లుల్లి

వెల్లుల్లి గీతలు, పుళ్ళు మరియు కోతలను నయం చేయటంలో పురాతన కాలం నుండి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన మైక్రోబియల్ ఏజెంట్ ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షించటానికి సహాయపడుతుంది. అయితే వెల్లుల్లి కొంత చికాకును కలిగిస్తుంది. ఒక కప్పు వైన్ లో మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా కలిపి రెండు నుండి నాలుగు గంటల తర్వాత వడగట్టాలి. ఈ ద్రవాన్ని రోజులో కొన్ని సార్లు గాయానికి రాస్తే మంచి పలితం కనపడుతుంది. ఒకవేళ చికాకు దీర్ఘకాలం ఉంటే కనుక ఈ నివారణ చేయటం ఆపేయాలి.

English summary

Here some simple Home remedies for scratches. A few ingredients in your kitchen can even help in healing them easily and effectively. Before following any such remedies and self-treatments, you need to clean and dry out the scratches and cuts to reduce the risks of developing scars and infections.