దూమపానం చేసే వారికి సిరప్‌

Home remedy will help you clean your lungs

04:48 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Home remedy will help you clean your lungs

మీకు సిగరెట్‌ తాగే అలవాటు ఉందా? ఉంటే తప్పకుండా మీ ఊపిరితిత్తులు ప్రమాదానికి గురయ్యాయనే చెప్పాలి. మీ ఊపిరితిత్తులను ఎలా రక్షించుకోవాలనే కదా మీ ఆలోచన? కంగారు పడకండి దానికి ఒక అద్బుతమైన చిట్కా ఉంది. ఆరోగ్యకరమైన ఒక రెసిపీ తాగడం వలన ఊపిరితిత్తులను శుభ్రపరచుకోవచ్చు.

1/6 Pages

ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలు:

ధూమపానం అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తుల నిండా నికోటిన్‌ నిండి ఉంటుంది. సిగరెట్‌, పొగాకు అలవాట్లు ఉన్నవారికి నోటి క్యాన్సర్‌, లంగ్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు అధికం. ఇవి ఊపిరితిత్తులను నల్లని తారు రంగులోకి మారుస్తాయి. అందువల్ల చెడు అలవాట్లు ఉన్నవారు ఇకనుండైనా మానుకోవడం మంచిది. ఈ అలవాట్లను దూరం చేసుకోకపోతే తప్పకుండా చెడు ఫలితాన్ని పొందుతారు. అందువల్ల వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు కష్టంగా అనిపిస్తే ఒకే రోజులో మానకుండా క్రమంగా నెమ్మదిగా ఆ అలవాట్లను దూరం చేసుకోవాలి. ముందుగా పాడైన ఊపిరితిత్తులను శుభ్రపరుచుకోవడం ఎలాగో చూద్ధాం. దీనికోసం ఒక చక్కని పరిష్కార మార్గం ఉంది అదే ఆరోగ్యకరమైన రెసిపీ. అదెలా తయారుచేయాలో చూద్ధాం.

కావలసినవి:

 1. పసుపు -2 టీస్పూన్స్‌
 2. ఉల్లిపాయ -400 గ్రాములు
 3. అల్లం -1 అంగుళం
 4. నీళ్ళు -1 లీటర్‌
 5. పంచదార లేదా తేనె - 400 గ్రాములు

తయారు చేసే విధానం:

 1. ముందుగా ఒక లీటరు నీటిని తీసుకుని దానిలో పంచదారని కలిపి వేడిచేయాలి. ఒకవేళ పంచదారకి బదులుగా తేనెని వాడాలి అని అనుకునేవారు తేనెని చివరిలో కలపాలి. ఇలా చేయడం వలన తేనె లోని గుణాలు కోల్పోవు.
 2. తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం తరుగుని ఆ వేడి నీటిలో వేయాలి.
 3. బాగా మరిగిన తరువాత పసుపు ని కలిపి స్టవ్‌ మంటని తగ్గించాలి.
 4. సగానికి సగం నీరు మిగిలే వరకూ బాగా మరగనివ్వాలి.
 5. తరువాత స్టవ్‌ ఆపేసి, ఆ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
 6. చల్లారిన మిశ్రమాన్ని బాగా కలిపి ఒక జార్‌లో నిల్వచేయాలి.
 7. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.

English summary

Home remedy will help you clean your lungs. Smoking habit causes lung cancer and mouth cancer. Smoking cigarettes the lungs become loaded with nicotine and tar.