ఈ ఎఫెక్టివ్ డ్రింక్ సేవిస్తే, దగ్గు, శ్వాసకోశ సమస్యలు మాయం

Homemade Recipe for Cough and Respiratory Problems

01:21 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

Homemade Recipe for Cough and Respiratory Problems

వాతావరణం మారినా, పడని వస్తువులను తిన్నా, నీరు పడకపోయినా అధిక శాతం మందికి జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. అలా వచ్చిన వెంటనే ఇంగ్లిష్ మెడిసిన్ వాడడం ఈ మధ్య ఎక్కువైపోయింది. దీని వల్ల అప్పటికప్పుడు సమస్య తగ్గినా, దీర్ఘకాలికంగా ఇలా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. అలా జరగకుండా ఉండాలంటే వీలైనంత వరకు సహజ సిద్ధమైన పదార్థాలనే మన అనారోగ్య సమస్యలకు చిట్కాలుగా ఉపయోగించాలి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను మన ఇంట్లోనే సహజ సిద్ధంగా ఉండే పదార్థాలతో తగ్గించుకోవచ్చు.

దగ్గు, జలుబు తగ్గాలంటే అరటి పండు, తేనెల మిశ్రంతో ఓ డ్రింక్ తయ్యారు చేసుకుని, రోజూ నాలుగు మోతాదుల్లో పట్టిస్తే, ఇక సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరి ఆ డ్రింక్ను ఎలా తయారు చేయాలంటే,...

ఒక పాత్రలో నీటిని 400 ఎంఎల్ తీసుకుని బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిలో మామూలుగా పండిన రెండు అరటి పండ్లను బాగా నుజ్జు చేసి వేయాలి. అప్పుడు ఆ పాత్రపై మూత పెట్టి 30 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. చివర్లో ఆ మిశ్రమానికి 2 టేబుల్ స్పూన్ల తేనెను కలపాలి.దీన్ని రోజుకు 4 సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి) 100 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు తాగాలి. అలా ఒక రోజు చేశాక రెండో రోజు నుంచే సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆ మార్పును మీరు గమనించవచ్చు కూడా. ఈ విధంగా రెండు, మూడు రోజుల పాటు చేస్తే సదరు అనారోగ్య సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. మరి ఇక ఎందుకు ఆలస్యం వెంటనే మీ ఇంట్లో ఎవరికైనా ఈ సమస్య వుంటే, వెంటనే అమల్లో పెట్టెయ్యండి.

ఇది కూడా చూడండి: తల్లి పాలలో పాము విషం - తల్లీ బిడ్డ మృతి

ఇది కూడా చూడండి: ఆ విషయంలో 'నాగ్' చెప్పినట్టే 'చిరు' చేస్తాడు

ఇది కూడా చూడండి: ఐపీఎల్ లో మన క్రికెటర్లు ఒక్క రన్ కి ఎంత సంపాదించారో తెలుసా?

English summary

In this article, we discuss about Homemade Recipe for Cough and Respiratory Problems.