హోండా నుంచి కనెక్ట్‌ యాప్‌ 

Honda Connect app launched

05:41 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Honda Connect app launched

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా తన వినియోగదారుల కోసం సరికొత్త యాప్ ను విడుదల చేసింది. హోండా కనెక్ట్‌ పేరుతో కొత్త మొబైల్‌ యాప్‌ను రిలీజ్ చేసింది. తమ సంస్థతో వినియోగదారులకు సమాచార మార్పిడి కోసం మెరుగైన వేదిక ఉండాలన్న ఉద్దేశంతో తాము ఈ యాప్‌ని విడుదల చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. హోండా కార్లకు సంబంధించిన సమాచారమంతా ఈ యాప్‌లో పొందుపరిచామని చెప్పింది. హోండా జాజ్‌, సిటీ, సీఆర్‌వీ కార్లు కొనుగోలు చేసిన కొత్త వినియోగదారులకు మాత్రమే ఈ యాప్‌ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా డీలర్‌షిప్‌ని కూడా ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. హోండా కార్స్‌ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ కత్సుషి మాట్లాడుతూ... ఇటీవల కాలంలో సాంకేతికత అందరి జీవితాల్లో భాగమైపోయిందన్నారు. అలాంటి వారందరికీ తమ సంస్థను చేరువ చెయ్యాలన్న ఉద్దేశంతోనే తాము ఈ హోండా కనెక్ట్‌ యాప్‌ని విడుదల చేసినట్లు చెప్పారు.

English summary

Honda India company has launched a new smartphone app called Honda Connect for iOS and Android which helps drivers “advanced connectivity” with their Honda car.