‘సుల్తాన్‌’ కోసం హనీసింగ్‌ గళం

Honey Singh To Sing Song In Salman Sultan Movie

04:08 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Honey Singh To Sing Song In Salman Sultan Movie

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ సినిమా అంటేనే అభిమానులకు పండగే పండగ. దానికి అన్ని హంగులు, మసాలా కూడా ఉండనే వుంటాయి. ఇందులో భాగంగా ‘బజరంగీ భాయీజాన్‌’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ లాంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ బద్దలు కొడుతున్న సల్లూభాయ్‌ ప్రస్తుతం ‘సుల్తాన్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన సల్మాన్‌, అనుష్కశర్మల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఇక బాలీవుడ్‌ ర్యాప్‌ సింగర్‌ హనీసింగ్‌ కూడా వీళ్లకు తోడయ్యాడు. ‘సుల్తాన్‌’ కోసం ఆయన ఓ పాట పాడబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. షారుఖ్‌ కోసం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో పాడిన ‘లుంగీ డ్యాన్స్‌’ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే రేంజ్‌లో ‘సుల్తాన్‌’పాట కూడా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ తాజా వార్తతో అభిమానుల్లో ఆనందం వేల్లివిరుస్తోందట. ఇక సుల్తాన్ అంచనా రోజు రోజుకీ ఏ రేంజ్ కి చేరుతోందో అర్ధం చేస్తుకోవచ్చు.

ఇటీవల జరిగిన జీ సినిమా అవార్డు ఫంక్షన్‌లో సల్మాన్‌, హనీసింగ్‌లు కలుసుకున్నారు. ఆ సందర్భంలోనే ‘సుల్తాన్‌’ సినిమా కోసం హనీసింగ్‌ని ఓ పాట పాడమని సల్మాన్‌ నోరు తెరిచి అడగడం, దానికి అందుకు హనీసింగ్‌ ఒప్పేసుకోవడం చకచకా జరిగిపోయాయని అంటున్నారు. మరి ఈ పాట ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

English summary

Salman Khan was presently acting in Sultan Movie.Anushka was acting heroine in this movie.Recently in a movie awards function Salman Khan asked Honey Singh to sing a song in his movie and honey singh was also accepted to sing song in his movie.