తేనెటీగలు కూడా కాఫీప్రియులే

Honeybees likes coffee

07:31 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Honeybees likes coffee

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ మార్నింగ్ కాఫీ తాగకుండా వాళ్ల వాళ్ల దినచర్య ని మొదలు పెట్టరు. అలాగే సాయంకాలం కూడా తాగుతారు. కాఫీచుక్క పడనిదే కొంతమందికి రోజు గడవదు. మనుషులు ఐతే సర్లే కానీ కీటకాలకి కూడానా??
పరిశొదకుల కొత్త అధ్యయనం ప్రకారం తేనెటీగలు కఫ్ఫైయినేటెడ్ ఉన్న వాటినే ఎంచుకొంటాయని తెలియజేశారు. అధ్యయనం ద్వారా తెలిసింది ఏంటంటే అవి కఫ్ఫైయినేటెడ్ తేనెని ఎంచుకుంటాయని లేకపోతే సమాన నాణ్యత కలిగిగిన వాటినే ఎంచుకోడానికి ప్రయత్నిస్తాయని తెలిపారు.
అంటే మొక్కలలో తేనె, కేఫిన్ తో చేర్చబడి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. అసలు క్యాఫీన్ ఒక వ్యసనం లాంటిది. పరిశొదకులు తేనెటీగ ని వాస్తవం గా పరీక్షించారు. సుక్రోజ్ సల్యూషన్ ని కేఫిన్ తో మరియు కేఫిన్ లేకుండా ఇచ్చి వాటి స్పందనలను కనుగొన్నారు, కేఫిన్ తీసుకున్న తేనెటీగలు చాలా యాక్టివ్గా ఇంకా వాళ్ళ స్నేహితులని కూడా ఆ కేఫిన్ మేత ఉండే స్తలానికి తీసుకువెళ్తాయి, తరుచూ నృత్యం చేస్తూ ఉన్నాయని పరిశోదనల ద్వారా తేలింది. ఈ తేనెటీగలు నిరంతరం శ్రమిస్తూ ఉంటాయి ముందు కనుగొన్న ప్రదేశాలలో ఆహారం అంతా అయిపోయేవరకు వాటికీ ఆహారం సరిపొయినా సరే అవి తిరిగి తిని ఖాళీచేస్తాయి అని తెలిపారు. ఒకొక్క తేనెటీగ ని పరీక్షించి, క్యాఫ్ఫెనేటెడ్ తేనె వల్ల తేనె ప్రొడక్షన్ తగ్గుతుందని, తేనె తియ్యదనం కూడా తగ్గుతుంది అని శాస్ర్తవేత్తలు తేల్చారు.

English summary

Honeybees likes coffee, according to researchers honeybees attracts mostly caffeinated food