హానర్ హోలీ 2 ప్లస్.. హాట్ కేక్..

Honor Holly 2 Plus Smartphone

11:05 AM ON 19th February, 2016 By Mirchi Vilas

Honor Holly 2 Plus Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువాయ్. ఈ సంస్థ హానర్ సిరీస్ లో హోలీ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ లో ఫిబ్రవరి 15న ఫ్లాష్ సేల్ పెట్టింది. అయితే ఈ సేల్ ప్రారంభించిన కొద్దిసేపటికే అన్ని ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అమ్మకాలు ప్రారంభించిన నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ అయిపోయాయని హువాయ్ వెల్లడించింది. ఈ ఫోన్ ధర రూ.8,499.

హానర్ హోలీ 2 ప్లస్ ఫీచర్లు ఇవే..

5 అంగుళాల హెచ్ డీ తాకే డిస్‌ప్లే, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టం, 2జీబీ ర్యామ్‌, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 13 మెగాపిక్సల్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 16 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్‌డీ కార్డుతో మెమొరీని 128జీబీ వరకు పెంచుకునే సదుపాయం, 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, 64 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్

English summary

Huawei company launched a new smart phone named Honor Holly 2 Plus.This smartphone comes with the key features like 1.3GHz quad-core processor,2GB RAM,13-megapixel rear camera,5-megapixel front camera.The price of this smartphone was Rs. 8,499