అల్లు అర్జున్ మొహం పై మళ్లీ కామెంట్ చేసిన అనసూయ

Hot anchor Anasuya comments on Allu Arjun face

10:22 AM ON 18th May, 2016 By Mirchi Vilas

Hot anchor Anasuya comments on Allu Arjun face

గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే సినిమా హిట్ అయినా అల్లు అర్జున్ మొహం చూసి వీడు హీరో ఏంటి అనుకున్నారంతా.. కానీ అవేవి పట్టించుకోకుండా తనను తాను మార్చుకున్నాడు బన్నీ. తన నటన, డాన్స్ తో టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని స్టైలిష్ స్టార్ గా చెలామణి అవుతున్నాడు. అయితే అల్లు అర్జున్ ఎంత స్టార్ గా ఎదిగినా ఇప్పటికీ చాలా మంది అల్లు అర్జున్ ఫేస్ కి చాలా సర్జరీలు చేయించుకున్నాడు అని అంటూ ఉంటారు. అయితే తాజాగా మంచు లక్ష్మీ షోకి వచ్చిన యాంకర్ అనసూయ మళ్లీ అల్లు అర్జున్ టాపిక్ తీసుకురావడంతో మళ్లీ వివాదాస్పదమైంది.

ఒకప్పుడు అల్లు అర్జున్ అంటే నాకు అసలు నచ్చేవాడు కాదని అతను హీరోనా అని చాలాసార్లు అనుకున్న అని చెప్పింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పింది. కాని కొంత మంది అల్లు అర్జున్ అభిమానులు మాత్రం నా మీద పగ పెంచుకున్నారు కావాలనే నన్ను ఏడిపిస్తున్నారు అని కెమెరా ముందే కన్నీటి పర్యంతమైంది.

English summary

Hot anchor Anasuya comments on Allu Arjun face. Hot sexy anchor Anasuya comments on Allu Arjun face in Manchu Lakshmi Prasanna show.