పెళ్లి కాకుండానే హాట్ యాంకర్ తో కాపురం చేస్తున్న యంగ్ హీరో!

Hot anchor and Young hero in illegal affair

06:38 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Hot anchor and Young hero in illegal affair

పెళ్లికాకుండానే ఒక ఆడ-మగ కలిసి ఒకే ఇంట్లో సమాజంతో సంబంధం లేకుండా ఇద్దరికీ నచ్చి కలిసి చేసే అనధికారిక కాపురం. ఆ తరువాత ఇద్దరిలో ఏ ఒక్కరి మనసు కాస్త గాయపడినా.. ముఖం మొత్తినా నిరభ్యంతరంగా విడిపోవచ్చు.. ఎవరి దారి వారు చూసుకోవచ్చు. దీనిపేరే సహజీవనం! ఒకప్పుడు చెప్పడానికి కాస్త ఇబ్బందిపడే విషయం. కానీ ఇప్పుడు ముఖ్యంగా సెలబ్రిటీ వర్గాల్లో చాలా కామన్ అయిపోయిన అంశం ఈ సహజీవనం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఇలా జరిగుతుందట అని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇండియాలోనూ సర్వసాదారణమైపోయింది. తాజాగా ఈ జాబితాలోకి ఒక తెలుగు టీవీ యాంకర్ - ఓ యంగ్ హీరో చేరిపోయారట.

టీవీషోలతో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు - ఒక్కోసారి కాస్త ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ పాత్రలు చేస్తూ బిజీగా ఉండే యాంకర్-మొదట్లో అడపాదడపా హిట్లు కొట్టి అవకాశాలు దక్కించుకుని, ప్రస్తుతం కాలం కలిసి రాక ఖాళీ అయిపోయి గోళ్లు కొరుక్కుంటున్న ఆ హీరో సహజీవనంలో ఉన్నారు. ఆమె.. ఒక ఫేమస్ టీవీ యాంకర్ - అతడు.. ఒక యంగ్ హీరో కావడంతో ఫిల్మ్ నగర్ లో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ యంగ్ హీరో ఫాంలో ఉన్న సమయంలోనే ఆ యాంకర్ అతడిని తెగ ఇష్టపడేదట - ప్రస్తుతం ఈ హీరో స్ట్రగ్లింగ్ లో ఉన్నా కూడా ఆమె ప్రేమలో ఏమాత్రం తేడారాకపోవడంతో.. వీరిమధ్య ప్రేమ ముదిరి పాకానపడి సహజీవనం వరకూ వెళ్లిందట. జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ నర్స్ కే ఎక్కువ... అన్నట్లు ప్రస్తుతం ఈ హీరోకోసం ఆ యాంకరమ్మ తనకు తెలిసిన వారందరి దగ్గరా సిఫార్సులు చేస్తోందట. అన్నీ అనుకూలించి కాలం కలిసివస్తే త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలని ఫిక్సయ్యారట ఈ జంట! మరి ఏమవుతుందో చూద్దాం..

English summary

Hot anchor and Young hero in illegal affair