తల్లి కాబోతున్న ఉదయభాను!

Hot anchor Udaya Bhanu is pregnant

06:39 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Hot anchor Udaya Bhanu is pregnant

యాంకర్ ఉదయభాను అంటే తెలియని వారు ఉండరు. అంతలా ఆమె బుల్లి తెరను ఊపేసింది. నాలుగు పదుల వయసున్న ఏ మాత్రం వయసు తెలియకుండా కనబడటం ఆమెకే చెల్లింది కాబోలు. అయితే ఉదయ భాను ఈ స్టార్ హోదాకు చేరడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఉదయభానుకు చాలా చిన్న వయస్సులోనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. అయితే ఆ ముస్లిం వ్యక్తితో జరిగిన పెళ్లి ఉదయభానుకు అస్సలు ఇష్టం లేదు. ఉదయభాను తల్లి ఆమెను బలవంతంగా అతడికి ఇచ్చి ఆమె పెళ్లి చేసింది. అయితే కొద్ది రోజులకే ఆమె తన మొదటి భర్తకు దూరమైంది.

తర్వాత ఆమె చదువు పై శ్రద్దపెట్టి టీవీ యాంకరింగ్ పై దృష్టి పెట్టి విజయం సాధించింది. తర్వాత ఆమె యాంకర్ గా బుల్లితెరను ఓ ఆటాడుకుంది. ఆ టైంలో సుమ వంటి వాళ్ళు కూడా ఉదయభానుకు పోటీ ఇవ్వలేకపోయారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హాట్ హాట్ యాంకర్గా బాగా సక్సెస్ అయ్యింది. తర్వాత ఉదయభాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత టీవీ యాంకరింగ్ చేస్తూనే ఎంఏ పూర్తి చేసింది ఉదయభాను. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించింది.

కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో ఉదయభాను చిందులేసినా వెండితెర మీద ఆమెకు అనుకున్న గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఆమెకు యాంకరింగ్ తో పాటు, సినిమా ఛాన్స్ లు కూడా తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు ఆమె తల్లి కాబోతోందని తాజా సమాచారం. పెళ్లి చేసుకున్న పదేళ్ల తర్వాత పిల్లలు కావాలని అనుకుందట. అందుకే ప్లాన్ చేసి మరి తల్లి కాబోతోందట ఉదయ భాను. త్వరలోనే ఆమె తల్లి కాబోతుంది..

English summary

Hot anchor Udaya Bhanu is pregnant. Hot telugu anchor Udaya Bhanu is now pregnant.