అప్పుడు నగ్న సెల్ఫీతో షాకిచ్చి.. ఇప్పుడు నన్ గా మారిపోయింది..

Hot model Sofia Hayat turned as nun

10:53 AM ON 24th May, 2016 By Mirchi Vilas

Hot model Sofia Hayat turned as nun

బిగ్ బాస్ 7 సిరీస్ లో పాల్గొని అప్పట్లో తన హాట్ హాట్ అందాలతో అలరించి, అదే సమయంలో అర్మాన్ కోహ్లీతో గొడవ పెట్టుకుని షో మధ్యలోనే వెళ్ళిపోయిన టాప్ మోడల్ సోఫియా హయత్ ఇప్పుడు ఉన్నట్టుండి నన్ గా(పెళ్లి చేసుకోకుండా మదర్ తెరెసాలా ఉండిపోవడం) మారిపోయి ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు తన అసలైన రూపం ఇదీ అంటూ నన్ గా మారిన తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని పక్కనపెడితే, బ్రిటీష్ మోడల్ అయిన సోఫియా 2012లో తన మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు, అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది.

అటువంటి సోఫియా ఇప్పుడు నన్ గా మారిపోవడంతో ఇప్పుడు ఇదో సంచలనంగా నిలిచింది. ఇక్కడితో ఆగకుండా.. ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని, తనను గయా సోఫియా మదర్ అని పిలవాలని ఈ సందర్భంగా సోఫియా హయత్ చెప్పడం మరింత విశేషం.

English summary

Hot model Sofia Hayat turned as nun