దారుణం భర్తను చెట్టుకు కట్టేసి భార్యను గ్యాంగ్ రేప్ చేసారు

House wife gang raped in Nellore

03:23 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

House wife gang raped in Nellore

ఏం చేస్తాం చెప్పండి, ఇవి చదవాలంటే మీకు ఎంత విసుగు వస్తుందో, ఇవి రాయాలంటే మాక్కూడా అంతే చిరాకు వస్తుంది. ఒక్కటి మర్చిపోక ముందే మరొకటి వెలుగులోకి వచ్చేస్తుంది. రోజు కూడా గడవటంలేదు. ఈ లోకంలో ఒక్క మంచి జరిగే లోపే వెయ్యి తప్పులు జరిగిపోతున్నాయి. అంటే ఇక్కడ మంచికన్నా తప్పులే త్వరగా చెయ్యొచ్చు. అసలు విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తంబిలిపట్నంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భర్తను చెట్టుకు కట్దేసి అతని ఎదుటే భార్య పై ఐదుగురు కీచకులు సామూహిక అత్యాచారం చేశారు.

బైక్‌ పై వెళ్తున్న దంపతులను ఆపిన వారు భర్తను చెట్టుకు కట్టేసి భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఆ దంపతులు ఇద్దరు కనిపించకుండా పోయారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary

House wife gang raped in Nellore. House wife gang rapes in Nellore by 5 members. They tied her husband to pole and raped his wife.