జనం మధ్యే కొట్టేసుకున్న హీరోయిన్లు(వీడియో)

Housefull 3 movie promotions stunt by heroines

02:43 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Housefull 3 movie promotions stunt by heroines

వీళ్ళు మామాలు వాళ్ళు కానే కాదు.. సెలబ్రిటీలు... అయినా జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టేసుకున్నారు. పైగా జనం మధ్య... ఇంతకీ వీళ్ళెవరంటే బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లీసా హేడెన్లు. ఈ ఇద్దరూ అభిమానులు చూస్తుండగానే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. అయితే ఇదంతా వారు నటించిన 'హౌస్ఫుల్ 3' ప్రచారం కోసం. ఈ చిత్ర ప్రచారాన్ని అహ్మదాబాద్లో నిర్వహించారు. అక్కడ స్టేజ్ పై అభిమానులతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి వీరిద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని తోసుకుంటూ కొట్టుకున్నారు.

అది చూసి అక్కడున్న అభిమానులు కంగారు పడిపోయారు. ఎందుకు కొట్టుకుంటున్నారో ఎవరికీ అర్దం కాలేదు. సరదాగా, ప్రచారం కోసం చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అలా ఇద్దరూ కొట్టుకుంటున్నప్పుడు అక్షయ్కుమార్ వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అక్షయ్కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అభిషేక్ బచ్చన్, నర్గిస్ ఫక్రి, రితేశ్ దేశ్ముఖ్, లీసా హేడెన్ లు జంటలుగా నటించారు. సాజిద్ ఫర్హాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. మొత్తానికి షూటింగ్ అంత పని చేసింది.

English summary

Housefull 3 movie promotions stunt by heroines