ఉద్యోగం కోసం వింత ప్రయత్నం

How did a man landed his dream job

04:53 PM ON 21st November, 2015 By Mirchi Vilas

How did a man landed his dream job

ప్రతీఒక్కరూ ఉద్యోగం కోసం ఏదోలా ప్రయత్నం చేసిన వారే. కోరుకున్న ఉద్యోగం దక్కేవరకూ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, లేదా కాళ్ళు అరిగేలా వచ్చిన ప్రతీ ఇంటర్వ్యూకు వెళ్ళి కంపెనీలు అడిగే సవాలక్ష యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కళ్ళు తేలేయడం వంటివి షరా మామూలు. కానీ ఐర్లాండ్‌ కు చెందిన లియామ్‌ టుట్టీ అనే వ్యక్తి తన డ్రీమ్‌జాబ్‌ను సంపాదించేందుకు చేసిన ప్రయత్నం మాత్రం నిజంగా వినూత్నంగా అనిపిస్తుంది.

సదరు లియామ్‌ ఇప్పటికే డిజిటల్‌ మార్కెటింగ్‌లో నిపుణుడిగా పనిచేస్తుండగా ఒక సారి ఐర్లాండ్‌కు చెందిన ప్రముఖ బీర్ల తయారి కంపెనీ తన సంస్థను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనను చూసిన లియామ్‌ ఎలాగైనా ఆ బీర్ల కంపెనీలో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. నిజానికి ఆ సంస్థ కేవలం తన విస్తరణ పథకాలను మాత్రమే వివరించింది. ఎలాంటి కొత్త జాబ్‌లకు సంబంధించిన విషయాన్ని ప్రకటించలేదు. కానీ ఖచ్చితంగా తనకు ఏదో ఒక స్థానం ఆ సంస్థలో ఉంటుందని భావించన లియామ్‌ ఒక వినూత్నమైన ఆలోచన తన డ్రీమ్‌జాబ్‌లో చేరేందుకు ప్రయత్నం చేసాడు.

అదేమిటంటే లియామ్‌ తాను సొంతంగా ఒక బీర్‌ను ఇంట్లోనే తయారు చేసి ఒక నమూనా బీర్‌ బాటిల్‌లో పోసి కంపెనీకు తన రెజ్యూమ్‌ను పంపాడు. ఆ బీర్‌ బాటిల్‌పై తన కార్టూన్‌ ఉండేలా డిజైన్‌ చేయడమే కాకుండా, సంస్థలో జాబ్‌కోసం అప్లై చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే సొంతంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించి అందులో తన అర్హతలను ఏకరువు పెట్టాడు.

సదరు బీర్ల కంపెనీలో ఎటువంటి జాబ్‌ లేదని తెలిసినప్పటికీ తాను చేసిన ప్రయత్నంతో కంపెనీ దృష్టిని ఆకర్షించవచ్చునని ఎత్తుగడ వేసాడట. నిజంగానే అతని ఎత్తుగడ పారింది. సదరు బీర్ల కంపెనీ నుండి తన డ్రీమ్‌జాబ్‌లో చేరాలంటూ ఆహ్వానం అందింది. బీర్లపై ఎంతో మక్కువ ఉన్న వ్యక్తిని తన సంస్థలో చేర్చుకోవడం తమ అదృష్టమని కంపెనీ పేర్కొంటూ ఆఫర్‌లెటర్‌ను పంపింది. ఇంకేముంది మనోడు గాలిలో రెక్కలు కట్టుకుని విహరిస్తున్నాడు.

English summary

This man landed his dream by sending his prospective employers a bottle of beer as proof of his credentials.