గూగుల్ ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఏలా చేరుకుంటున్నారు

How Google Employees Goes To Higher Positions

07:27 PM ON 19th November, 2015 By Mirchi Vilas

How Google Employees Goes To Higher Positions

గూగుల్ సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చాలా కారణాలున్నాయి. గూగుల్ తన ఉద్యోగులకు ఉచిత అహారం,మసాజ్లు మరియు ఇతర విలాసవంతమైన ప్రోత్సహకాలు అందిస్తుంది. సాధారణంగా అనేక కంపెనీలు అత్యధిక సమయాన్ని విజయవంతమైన టీంలను ఏర్పచడానికి వెచ్చిస్తుంటారు . ఎందుకంటే కలిసి సమిష్టిగా పనిచేసినప్పుడే అద్బుతమైన ఆవిష్కరణలు వెలువడతాయి.

ఇది ఏమి గొప్ప విషయం కాదని , ప్రయత్నాలకు ఒక సరియైన దిశానిర్దేశం ఉంటే చాలని సాస్ డిగొ స్టేట్ యూనివర్సిటి మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అమిరాండెల్ అన్నారు.
గూగుల్ వారి డేటా విశ్లేషణ అధ్యయనం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఎప్పుడైతే టీంలోని సభ్యులంతా తాము రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామని అనుకుంటారో అలాంటి వాళ్ళు స్పష్టమైన లక్ష్యాలు కలిగి ఉంటారని చెబుతున్నారు.

ప్రొఫెసర్ జస్మిన్ హు , నోట్ర్ర్ డేమ్ యునివర్సిటి వారు 67 మంది లో కూడిన 6 వివిధ టీంల పై అధ్యాయనం చేయగా వారి పని సహా ఉద్యోగులకు సమాజానికి,కస్టమర్లకు ఉపయోగపడేలా ఉన్నప్పుడే ఒత్తిడికి లోను కాకుండా పని చేస్తారని చెప్పారు. ఈ పై 6 టీంలు వివిధ కంపెనీలకు చెందడం విశేషం.

గూగుల్ లోని 60,000 మంది ఉద్యోగులు కనీసం ఒక టీంలో నైనా పనిచేస్తారని కొంత మంది రెండు లేదా మూడు టీంలలో పనిచేస్తారని అన్నారు.
గూగుల్ సంస్థలోని ప్రతి టీంకు 3 నుండి 70 సభ్యులు ఒక ప్రాజెక్ట్ పై పనిచేస్తుంటారు.రెండెళ్ళ పాటు దాదాపు 200 టీంల పై పరిశోధన చేసిన గూగుల్ సంస్థ వారు ఏం చేస్తే అత్యంత ప్రభావంతమైన టీంలు ఎర్పడతాయో తెలుసుకున్నారు.

మొత్తానికి గూగుల్ వారు తమ ఉద్యోగుల పట్ల చూపే శ్రద్ధ వల్లే ఈ రోజు గూగుల్ ఇతంటి స్థాయికి చేరుకుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

English summary

Google encourages its employees by offering free food, massages,lavish perks,identifying teams and what motivates them to get better results