ఐసిస్ కు  డబ్బు ఎలా అందుతుంది?

How ISIS Makes Money

06:34 PM ON 19th November, 2015 By Mirchi Vilas

How ISIS Makes Money

రోజురోజుకు చెలరేగిపోతున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు ధన సహాయం ఎలా అందుతుదన్నదని అన్న ప్రశ్న అందరిలోను ఆసక్తి కలిగిస్తుంది . ఆయుధాలు,వాహనాలు,ఉద్యోగజీతాలు ,ప్రచారవీడియోలు,అంతర్జాతీయ ప్రయాణాలకు ఇలా ప్రతిదానికి డబ్బు అవసరం, వీటి నిర్వహణకు ఐసిస్ కు డబ్బు ఎలా సమకూర్చుకుంటోందనేది అంతు చిక్కని ప్రశ్న.

అమెరికా అధికారిక ప్రకటన ప్రకారం ఐసిస్ తన ఉద్యోగులకు నెలకు సుమారు 400 డాలర్ల డబ్బును ఖర్చుచేస్తుందన్నారు. ఐసిస్ డొనేషన్ల రూపంలో అనేక డాలర్ల డబ్బును సమకూర్చుకోగలుగుతుందని అన్నారు . ముఖ్యంగా గల్ఫ్-ఆధారిత ఆర్ధికవేత్తల నుండి అధిక మొత్తంలో ధనాన్ని డొనేషన్ల రూపంలో పొందుతున్నట్లు తెలిపారు . ముఖ్యంగా ఇరాక్,సిరియా లోని ఆయిల్ నిక్షేపాల నుండి సొమ్మును సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు .

ఐసిస్ గ్రూపులను అంతం చెయ్యడంలో భాగంగా ఐసిస్ ప్రధాన వనరులైన ఆయిల్ నిక్షేపాలను అమెరికా సైన్యం విమానాల సహాయంతో ధ్వంసం చేస్తుంది . అమెరికా,బ్రిటన్ వంటి దేశాలు ఐసిస్ కు గుట్టు గా నిధులందిస్తున్న యురోపియన్ దేశాల ఆర్ధిక వేత్తలను ఉగ్రవాదులకి నిధులు సమకూర్చడం అపివేయలను అదేశించింది . ప్రస్తుతానికైతే ఐసిస్,వాటి అవసరాలకు ఏదైనా కొనుగోలు చేసేంత పతిష్ట స్థితిలో ఉందని పేర్కొన్నారు.

English summary

How ISIS makes money for its needs like purchasing of weapons,flight tickets,giving salaries to its employees