గూగుల్ గురించి ఈ విషయం మీలో ఎంత మందికి తెలుసు?

How many members know about google

11:36 AM ON 28th September, 2016 By Mirchi Vilas

How many members know about google

గూగుల్ పుట్టినరోజు జరుపుకుంటోంది. గూగుల్ సంస్థ ఏర్పడి ఈ సెప్టెంబర్ తో 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీంతో సెప్టెంబర్ 26న గూగుల్ తన యూజర్లకు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హోమ్ పేజ్ లో డూడుల్ ను రూపొందించింది. గూగుల్ ను 1998 సెప్టెంబర్ 4న ల్యారీ పేజ్, సెర్జిబ్రిన్ సంయుక్తంగా ప్రారంభించారు. గూగుల్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. ఈ 16 సంవత్సరాల్లో గూగుల్ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. కొత్తగా అనేక రకాల సేవలను వినియోగదారులకు అందించింది. ప్రస్తుతం చెన్నైకి చెందిన సుందర్ పిచై గూగుల్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గూగుల్ కంపెనీ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన సందేహం చాలామందిని వెంటాడుతోంది.

గూగుల్ సంస్థ ఏర్పడింది సెప్టెంబర్ 4న. కానీ 2004లో సెప్టెంబర్ 7న, 2006లో అయితే ఏకంగా సెప్టెంబర్ 26న బర్త్ డే సెలబ్రేషన్స్ చేసి గూగుల్ అందరినీ సందిగ్ధంలో పడేసింది. ఈ సంవత్సరం కూడా 27న ప్రకటించింది. అయితే గూగుల్ ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కారణం లేకపోలేదు. గూగుల్ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. తమ కంపెనీ పుట్టినరోజును నాలుగు విభిన్న తేదీల్లో జరుపుకుంటామని సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు. ఏదేమైనా ఇంటర్నెట్ ద్వారా ఎంతోమందిని దగ్గర చేసిన గూగుల్ కు ఎందరో విషెష్ చెప్పారు. మనం చెప్పేస్తే మంచిదేగా.

ఇది కూడా చదవండి: టీనేజ్ లోనే తెల్ల జుట్టు వచ్చినవారు అస్సలు చెయ్యకూడని తప్పులు!

ఇది కూడా చదవండి: దారుణం: వ్యాపారం కోసం షాపులో పని చేసే అమ్మాయిలతో..

ఇది కూడా చదవండి: ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

English summary

How many members know about google. Google celebrating their birthday in 4 dates.