గర్భవతి మహిళ ద్వారా శిశువును ప్రభావితం చేసే 7 అంశాలు

How many ways Pregnant Women Affect Babies

11:39 AM ON 13th January, 2016 By Mirchi Vilas

How many ways Pregnant Women Affect Babies

శిశువు యొక్క పోలికలు మరియు చర్యలు అనేవి కొంత వరకు తల్లిదండ్రుల జన్యువుల నుండి వస్తాయి. శిశువుల పాత్ర గర్భంలోనే ప్రారంభం అవుతుంది. మహిళలకు మద్యం, ధూమపానం వంటి అలవాట్లు ఉంటే కనుక వారికి పుట్టబోయే పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.

కానీ గర్భవతి మహిళ నుండి ఆమె బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. నిజానికి శిశువులు అభివృద్ధి చెందటానికి ఈ తొమ్మిది నెలల సమయం సరిపోదని సిన్సినాటి పిల్లల హాస్పిటల్ మెడికల్ సెంటర్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ కిమ్ యోల్టన్ అంటున్నారు. ఈ సమయంలో అనేక సమస్యలు కూడా రావచ్చు. ఇక్కడ గర్భవతి అయిన తల్లులు తమ పిల్లలను ప్రభావితం చేసే ఏడు ఆశ్చర్యకరమైన మార్గాలు ఉన్నాయి. అలాగే వారి గర్భాన్ని ఎలా కాపాడుకోవాలో కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

1/8 Pages

1. గర్భాదరణ ముందు బరువు తగ్గాలి

ఊబకాయంతో ఉంటే గర్భాదరణ సమయంలో మధుమేహం రావటం లేదా నెలలు నిండకుండా ముందుగానే డెలివరి జరగటం జరుగుతుంది. అంతేకాక పుట్టే శిశువుకు ఊబకాయం మరియు మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇటీవలి అధ్యయనాలలో గర్భాదరణకు ముందు మహిళ బరువుకి అస్తమాకి లింక్ ఉందని తెలిసింది.

జనవరి లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఊబకాయంతో ఉన్న తల్లుల పిల్లలలో దాదాపు 12 శాతం మంది 14 నెలల వయస్సులో శ్వాసలో తేడా ఉన్నట్టు కనుగొన్నారు. సాధారణ బరువు ఉన్న తల్లులకు పుట్టిన పిలల్లో నాలుగు శాతం కన్నా తక్కువ ఉన్నట్టు గమనించారు.

గర్భాదరణకు ముందు తల్లులు వారంలో నాలుగు సార్లు రోజుకి 20 నిముషాలు చొప్పున వాకింగ్ చేయాలి. బరువు తగ్గటానికి ఈ రెగ్యులర్ వ్యాయామం సహాయపడుతుంది.

English summary

Here are seven surprising ways that pregnant moms can affect their babies, and tips for how they can protect their pregnancies.