ఐపీఎల్ లో మన క్రికెటర్లు ఒక్క రన్ కి ఎంత సంపాదించారో తెలుసా?

How much do cricketers earn per Run In This IPL

12:43 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

How much do cricketers earn per Run In This IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పేరు వింటే చాలు ఇండియాలోని క్రికెట్ అభిమానులకు పండుగే. దేశ విదేశాలలోని క్రికెటర్లు అందరిని ఒక చోట చేర్చే ఒక కాస్ట్లీయస్ట్ లీగ్ గా ఐపీఎల్ పేరు పొందింది. ఐపీఎల్ వేలంలో టీం ఓనర్ లు లక్షలు, కోట్లు పెట్టి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళు ఎవరో వారు ఐపీఎల్ లో చేసిన ఒకొక్క పరుగుకి/ వికెట్ కి ఎంత సంపాదించారో చూడాలంటే ఇంకెందుకు ఆలస్యం స్లైడ్ షో లోకి ఎంటర్ అయ్యిపొండి.......

1/11 Pages

10. పవన్ నేగి(రూ.1,465,517.24)

ఈ సంవత్సరం ఐపీఎల్ లో భారత అల్ రౌండర్ పవన్ నేగి ని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఏకంగా 8 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో పవన్ నేగి ఆశించిన స్థాయిలో రాణించకలేకపోయాడు. ఈ అల్ల్రొఉన్దెర్ ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో 8 మ్యాచ్ లు ఆడిన పవన్ నేగి కేవలం 58 పరుగులు చేసి ఒకే ఒక్క వికెట్ తీసాడు. పవన్ నేగి సగటున ఒక్క పరుగుకు(ఒక వికెట్ తో సహా) దాదాపు 1,465,517.24(85,000,000 / 58 పరగులు + ఒక్క వికెట్) రూపాయలను సంపాదించాడు.

English summary

Here are the players who earned more in this year Indian Premier League(IPL). Kohli was in Top position by earning total 15 crores in this year IPL.