2050కల్లా భూమిపై ఎంత మంది ఉంటారో తెలుసా?

How much people on the Earth according to 2050

04:29 PM ON 26th August, 2016 By Mirchi Vilas

How much people on the Earth according to 2050

ఈ భూమి పై మూడొంతులు నీరు ఉంటే 1 వంతు కొన్ని రకాల జీవులు ఉంటున్నాయి. మరికొన్ని నీటిలోనే జీవిస్తున్నాయి. ఇదిలా ఉంటే మనం ఇప్పుడు మనుషులు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ లెక్కేంటో చూద్దాం.. ప్రపంచవ్యాప్తంగా 2050వ సంవత్సరానికల్లా జనాభా 9.9 బిలియన్లకు చేరుకుంటుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో(పీఆర్బీ) తాజాగా అంచనా వేసింది. అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ నిధులతో జనాభా పెరుగుదలపై పరిశోధనలు జరిపిన పీఆర్బీ తాజాగా ప్రపంచ జనాభా డేటా షీట్ ను విడుదల చేసింది. ప్రస్థుతం 7.4 బిలియన్లున్న ప్రపంచ జనాభా 2050 కల్లా 33 శాతం పెరుగుతోందని తేల్చారు.

2053వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభా పది బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంటుందని అంచనా వేశారు. యూరోప్ దేశాల్లో జననాల రేటు అతి తక్కువగా ఉన్నా, ఆఫ్రికాలో జననాల రేటు రెట్టింపు నమోదవుతుందని పీఆర్ బీ అధ్యక్షుడు జెఫ్రీ జోర్డాన్ చెప్పారు. ఆఫ్రికాలో జనాభా 2050 కల్లా 2.5 బిలియన్లకు చేరుకుంటుంది. అదే అమెరికాలో జనాభా 223 మిలియన్ల నుంచి 1.2 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఆసియా ఖండంలో 900 మిలియన్లున్న జనాభా 5.3 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేశారు. కాగా యూరోప్ దేశాల్లో మాత్రం జనాభా 740 మిలియన్ల నుంచి 728 మిలియన్లకు తగ్గుతుందని తేల్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోనైతే 40 మిలియన్ల నుంచి 66 మిలియన్లకు జనాభా పెరుగుతుందని అంచనా వేశారు.

ఇది కూడా చదవండి: మనం పాటించే సంప్రదాయాలు వెనకున్న సైంటిఫిక్ రీజన్స్ తెలిస్తే ఇక అవే ఫాలో అవుతారు!

ఇది కూడా చదవండి: 'టాప్' లేపేసిన చరణ్ హీరోయిన్(ఫోటో)

ఇది కూడా చదవండి: నీ మొఖానికి అమ్మాయి కూడా పడిందా? మంచు లక్ష్మీ పంచ్

English summary

How much people on the Earth according to 2050