నోట్ల రద్దు యవ్వారం ఆ రెండు గదుల్లోనే సాగిందట

How Narendra Modi changed the currency

11:08 AM ON 10th December, 2016 By Mirchi Vilas

How Narendra Modi changed the currency

భారత ప్రధాని నరేంద్రమోడీ నవంబరు 8వ తేదీ రాత్రి పెద్ద నోట్ల రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించడానికి ముందు ఎటువంటి కసరత్తు జరిగింది? ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఎలా ఉంచగలిగారు? ఈ విషయంపై ఇప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మోడీకి అత్యంత నమ్మకస్తుడైన ఓ ఉన్నతాధికారి, మరో అయిదుగురు సభ్యుల బృందం ప్రధాని నివాసంలోనే నోట్ల రద్దు అంశంపై కసరత్తు చేశారు. వీరికి సమాచారం, ఆర్థిక అంశాల విశ్లేషణలో నిపుణులైన యువ బృందం సహకారం అందించింది. హస్ ముఖ్ అదియా సెప్టెంబర్ 25న రెవెన్యూ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు 2003 నుంచి 2006 వరకు అదియా ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. అప్పటి నుంచి ఆయన మోదీకి నమ్మకస్తుడిగా ఉన్నారు. మోదీ, అదియా కీలక విషయాలను గుజరాతీలో మాట్లడుకునేవారట. అదియా నాయకత్వంలోనే ప్రధాని నివాసంలో రెండు గదుల్లో నోట్ల రద్దుపై కసరత్తు మూడోకంటికి తెలియకుండా కసరత్తు జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడానికి కొంత సమయం ముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘దీనిపై నేను అధ్యయనం చేశాను. ఇది విఫలమైతే నాది బాధ్యత’ అని మోడీ చెప్పారని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు దరిమిలా దేశవ్యాప్తంగా కలకలం రేగడం, ఇప్పటికీ ప్రజలు బ్యాంకులు ముందు బారులు తీరి నానా ఇబ్బందులు పడుతుండడం తెలిసిందే. మరోవైపు మోదీ ‘నల్లధనంపై యుద్ధమిది.. ఇదే చివరి క్యూ’ అంటూ ప్రజల అంగీకారం పొందే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. బయట ప్రపంచానికి అంతగా తెలియని ఆదియా ప్రధాని తనకు అప్పగించిన సీక్రెట్ మిషన్ ని అత్యంత గోప్యంగా మూడో వ్యక్తికి తెలియకుండా జాగ్రత్తపడ్డారన్నది మోడీ ని సమర్ధించేవాళ్ళు అంటున్నమాట.

కొంతకాలంగా ఈ విషయంపై ఆరితేరిన కొంతమంది ఆర్థిక నిపుణులు పరిశోధన చేసిన తర్వాత మాత్రమే డిమోనిటైజేషన్ అనబడే పెద్దనోట్ల రద్దుకు జెండా ఊపారని చెబుతున్నారు. ఇంతచేసినా, ఎన్నిమాటలు వినిపిస్తున్నా పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలకు, మోదీ సన్నిహిత వర్గాలకు ముందే ఉప్పు అందించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముందస్తు సమాచారం అందుకున్న ఈ వర్గాలు అంతా సర్దుకున్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి. ఇక గదిలో కూర్చుని నిర్ణయాలు తీసుకున్నవారికి బయట కష్టాలు ఎలా తెలుస్తాయని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చూడండి: అఖిల్ నిశ్చితార్ధం .. ఇక పెళ్లే తరువాయి ...

ఇది కూడా చూడండి: స్త్రీల గురించి చాణక్యుడు చెప్పిన అపురూప విషయాలు

ఇది కూడా చూడండి: కొండగట్టు అంజన్న మహిమ తెలుసుకోండి

English summary

How Narendra Modi changed the currency..