రాత్రిపూట చదవొచ్చా ?

How night time reading affects on you

04:50 PM ON 16th December, 2015 By Mirchi Vilas

How night time reading affects on you

పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల అపారమైన జ్ఞానం మీ సొంతం అవుతుంది. అందువల్ల డాక్టర్లు కొన్ని సూచనలను తెలిపారు. పిల్లలు ఆరవ నెలలో ఉండగానే పుస్తక పఠనం చేయడం వల్ల జ్ఞానాన్ని పొందుతారు. అదే విధంగా మానసికంగా తొందరగా ఎదుగుతాడు. ఇలా చిన్న వయస్సు నుండి పుస్తకం చదవడం వారికి నేర్పించడం వల్ల మంచి జ్ఞానవంతులు అవుతారని తెలియజేసారు.

రాత్రిపూట పుస్తకాలను చదవడం వలన నిద్రవచ్చేస్తుంది. కారణం తినే ఆహారం వల్ల కావచ్చు అదే విధంగా నీరసం వల్ల కూడా కావచ్చు. రాత్రి పూట పుస్తకం చదవడానికి, పగలు చదవడానికి చాలా తేడా ఉంది. పగలు చదివినంత ఏకాగ్రతగా రాత్రి పూట చదవలేరు. రాత్రిపూట చదవడం వల్ల నిద్రని ప్రేరేపిస్తుంది. పుస్తకాలను రాత్రిపూట చదవడం మంచిదా ? కాదా ? అనే సందేహం అందరి మదిలోనూ మెదులుతుంది. దానికి సమాధానంగా నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం.

1/5 Pages

1. ప్రస్తుతం అందరూ ఎలక్ట్రానిక్‌ పరికరాలను వాడుతున్నారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం వలన చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కంప్యూటర్‌ ని వాడుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఎలాంటి విషయాన్ని అయినా క్షణాల్లో పొందవచ్చు. పుస్తకాలను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇ- పుస్తకంలో చదువుకోవచ్చు. ఒక్క క్లిక్‌ తో ప్రపంచంలోని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. కానీ వీటివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, లాప్‌టాప్‌లు ఎక్కువగా వాడడం వలన మీ కళ్ళు దెబ్బతింటాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి రాత్రుళ్ళు చదవడం వలన నిద్రలేమి ఏర్పడడంతో పాటు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తాయి. టెక్సాస్‌ నైరుతి మెడికల్‌ సెంటర్‌ విశ్వవిద్యాలయం వారు జరిపిన అధ్యయనంలో ఇ-పుస్తకాలను రాత్రిపూట చదవడం వలన, సహజంగా నిద్రరావడానికి కారణమైన మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని అణిచివేస్తుందని వారు తెలిపారు. అందువల్ల ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించి రాత్రిపూట చదవరాదు అని నిపుణులు తెలియజేసారు.

English summary

Night time reading unlike day time reading can influence your mood and sleep patterns in many ways.