శరీర దుర్వాసన దూరం చేసుకోండిలా !!

How to avoid bad body odor

06:15 PM ON 5th December, 2015 By Mirchi Vilas

How to avoid bad body odor

కొంత మంది శరీర దుర్గంధం అధికంగా ఉంటుంది. సాధారణంగా చెమట ఎక్కువగా పట్టడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. నిజానికి చెమట ఎటువంటి వాసన రాదు. దుర్వాసనకి కారణం బ్యాక్టీరియ. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే శరీరం పై బ్యాక్టీరియా ఏర్పడి, చెమట పట్టినప్పుడు దానితో కలిసి దుర్వాసనకి కారణం అవుతుంది. అందువల్ల చెమట పట్టినప్పుడు అసహ్యకరమైన వాసన వస్తుంది. ఈ బ్యాక్టీరియా తేమ ప్రాంతంలో బాగా పెరుగుతాయి. అందువల్ల శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కొంత మందిలో వారు తినే ఆహారం వలన శరీర దుర్గంధం ఏర్పడుతుంది. మాంసం అధికంగా తినడం వలన శరీర దుర్వాసన అధికంగా వస్తుంది.

శరీర దుర్వాసన మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా వస్తుంది. ఆరోగ్య, పోషకలోపాలు, దీర్ఘకాలిక మలబద్ధకం, జీర్ణవ్యవస్థ సమస్యలు, జన్యుపరమైన వ్యాదులు, కాలేయవ్యాధి, మరియు మధుమేహం వలన కూడా ఈ సమస్య కలుగుతుంది. అందువల్ల ఆరోగ్యాన్ని నిర్లష్యం చేయకుండా వైద్యులని సంప్రదించి సలహలను తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

శరీర దుర్వాసనని దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు.

1. బేకింగ్‌ సోడా

బేకింగ్‌ సోడా చర్మం నుండి తేమను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది చెమటని గ్రహించి శరీర వాసనని తగ్గిస్తుంది. ఇది ఒక సహజ సిద్ధమైన దుర్గంధనాశని గా పనిచేస్తుంది.

కావలసినవి :

 • బేకింగ్‌ సోడా - 1 టేబుల్‌స్పూన్‌
 • నిమ్మరసం - 1 టేబుల్‌స్పూన్‌

పాటించే పద్ధతి :

 • బేకింగ్‌ సోడా మరియు నిమ్మరసాన్ని బాగా కలిపి చెమట పట్టే ప్రదేశాలలో, చేతుల క్రింద భాగంలో రాసుకోవాలి.
 • ఇలా 2 నిమిషాలు గడిచిన తరువాత వీటితో శుభ్రంగా కడగాలి. స్క్రబ్‌ చేయకూడదు
 • అనంతరం శుభ్రంగా స్నానం చేయాలి.
 • ఇలా వారం రోజులపాటు రోజుకి ఒకసారి చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

2. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌

ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఒక శక్తివంతమైన చిట్కాఅనే చెప్పాలి. ఇది బ్యాక్టీరియా ఎదుర్కోవడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ఇది మీ చర్మం యొక్క పిహెచ్‌ స్థాయిని క్రమబద్ధీకరించి, శరీర దుర్వాసనని అరికట్టడంలో సహాయపడుతుంది.

కావలసినవి :

 • ఆపిల్‌ సైగర్‌ వెనిగర్‌
 • దూది

పాటించే పద్దతి :

 • ఆపిల్‌ సైటర్‌ వెనిగర్‌ లో దూదిని ముంచి, ఆ దూదిని బాగా చెమట పట్టే ప్రదేశాలలో రాసుకోవాలి.
 • రెండు మూడు నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
 • అనంతరం స్నానం చేయాలి. ఇలా చేయడం వలన మార్పుని మీరే గమనించవచ్చు.
 • ఇలా రోజుకి రెండు సార్లు ఉదయం స్నానం చేసేటప్పుడు మరియు నిద్ర పోయే ముందు స్నానం చేసేటప్పుడు ఈ విధంగా ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ రాసుకోవడం వలన శరీర దుర్గంధం నాశనమవుతుంది.

మరోపద్ధతి :

 • స్నానం చేసే వేడి నీటిలో ఒక కప్పు ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ని వేసి 10 నిమిషాలు నాననివ్వాలి.ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా రోజుకి ఒకసారి చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
 • ఒక గ్లాసుని తీసుకుని దానిలో 2 టేబుల్‌స్పూన్‌ ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌, కొద్ధిగ తేనె వేడి నీటిలో కలిపి రోజుకి 3 సార్లు బోజనం చేసిన తరువాత సేవించాలి.
 • ఇలా కొద్ధి రోజులపాటు చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

3. నిమ్మరసం

నిమ్మరసం శరీర దుర్వాసనని దూరం చేయడంలో అద్బుతంగా పనిచేస్తుంది. దీనిలో ఎసిడిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీర పిహెచ్‌ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

 • నిమ్మకాయని సగానికి కత్తిరించి, ఆ ముక్కలని చెమట పట్టే ప్రదేశాలలో, చేతుల క్రింద భాగంలో రాసుకోవాలి.
 • కొద్ధి సమయం గడిచిన తరువాత శుభ్రంగా కడిగి స్నానం చేయాలి.
 • ఇలా రోజుకి ఒకసారి చేయడం వలన శరీర దుర్వాసన దూరం అవుతుంది.
 • ఈ విధంగా మీకు మంచి ఫలితాలను పొందేవరకూ ఈ చిట్కాని పాటించాలి.

గమనిక

 • ఒక వేళ మీది సున్నితమైన చర్మం అయితే కనుక నిమ్మరసాన్ని డైరెక్ట్‌గా రాసుకోకూడదు. నిమ్మరసంలో కొద్ధిగ నీటిని కలిపి రాసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

4. రోజ్‌మేరీ

రోజ్‌మేరీ వాసన కలిగించే బ్యాక్టీరియాని నిరోదిస్తుంది. ఇది కూడా సహజసిద్ధమైన దుర్గంధనాశని గా పేరుగాంచింది. ఇది శరీరం నుండి వచ్చే గాటైన దుర్వాసనని దూరం చేస్తుంది.

కావలసినవి :

 • ఎండిన రోజ్‌మేరీ ఆకులు - 1/2 కప్పు
 • వేడినీళ్ళు - 4 కప్పులు.

పాటించే పద్ధతి :

 • 4 కప్పులు వేడినీటితో సగం కప్పు రోజ్‌మేరీ ఆకులను వేయాలి. ఇలా 10 నిమిషాలు నాననివ్వాలి.
 • తరువాత ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలిపి 20 నిమిషాల పాటు నాననివ్వాలి.
 • ఇలా 20 నిమిషాలు గడిచిన తరువాత శుభ్రంగా స్నానం చేయాలి ఇలా చేయడం వలన రోజంతా చర్మం తాజాగా, మంచి పరిమళాన్ని ఇస్తుంది.
 • ఇలా రోజుకి ఒకసారి చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

గమనిక

 • రోజ్‌మేరీ వాడేటప్పుడు ఏవిధమైన ఇరిటేషన్‌ కలిగినా దానిని వాడడం వెంటనే మానేయాలి. ముందుగా చర్మానికి పడుతుందో లేదో చూసుకొని ఏదైనా వాడడం మంచిది.

5. టీ ట్రీ ఆయిల్‌

టీ ట్రీ ఆయిల్‌ లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటిసెప్టిక్‌ గుణాలు ఉన్నాయి. అందువల్ల ఇది బ్యాక్టీరియాని అరికట్టడంలో అద్బుతంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని చెమట పట్టకుండా చెమటని నియంత్రిస్తుంది.

కావలసినవి :

 • టీ ట్రీ ఆయిల్‌ - 2 చుక్కలు
 • నీళ్ళు - 2 టేబుల్‌స్పూన్స్‌

పాటించే పద్ధతి :

 • రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ లో 2 టేబుల్‌స్పూన్ల నీళ్ళు కలిపి ఒక బాటిల్‌లో వేసుకొని భద్ర పరుచుకోవాలి.
 • దీనిని డియోడ్రెంట్‌ ఉపయోగించే విధంగా ఈ లిక్విడ్‌ని స్ప్రే చేసుకోవాలి.

గమనిక

 • టీ ట్రీ ఆయిల్‌ ని అతి సున్నితమైన చర్మం కలిగిన వారు వాడరాదు.

6. ఎర్ర ముల్లంగి

ఎర్ర ముల్లంగి లో యాంటి బ్యాక్టీరియా గుణాలు ఉండడం వలన ఇది చెడు వాసనకి కారణమైన బ్యాక్టీరియాని చంపుతుంది. దీనితో పాటుగా ఎర్రముల్లంగి లో విటమిన్‌ సి అధికమోతాదులో ఉంటుంది.

కావలసనవి :

 • ఎర్ర ముల్లంగి - 2 లేదా 3

పాటించే పద్ధతి :

 • 2 లేదా 3 ఎర్ర ముల్లంగిని ముక్కలుగా కోసుకొని మిక్సీలో వేసి బాగా మెత్తని పేస్ట్‌ చేయాలి.
 • ఆ పేస్ట్‌ని ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి వడకట్టాలి అప్పుడు ఎర్రముల్లంగి రసం వస్తుంది.
 • రసాన్ని చేతుల క్రిందబాగంలో, ఇంకా చెమట పట్టే ప్రాంతాలలో రాసుకోవడం వలన బాక్టీరియా నశించి దుర్వాసన రాకుండా చూసుకుంటుంది.
 • తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.
 • ఇలా రోజు ఉదయం చేయడం వలన శరీర దుర్వాసనని కనీసం 10 గంటల వరకు కంట్రోల్‌ చేస్తుంది.
 • ఎర్రముల్లంగి ని రోజూ ఆహారంలో తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

7. టమాటాలు

టమాటాలలో యాంటిసెప్టిక్‌ గుణాలు ఉన్నాయి. అందువల్ల అది బ్యాక్టీరియాని చంపి చర్మదుర్వాసనని తగ్గిస్తుంది. ఇది చర్మరంద్రాలను కుదించి మరియు చెమట పట్టడాన్ని తగ్గిస్తుంది.

కావలసినవి :

 • టమాటాలు - 7 లేదా 8

పాటించే పద్ధతి :

 • 7 లేదా 8 టమాటాలని తీసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
 • ఈ పేస్ట్‌ని ఒక శుభ్రమైన వస్త్రంలో వేసుకుని వడకట్టాలి. వచ్చిన రసాన్ని తీసుకొని స్నానం చేయడానికి సిద్థం చేసుకున్న బకెట్‌ నీటిలో వేసుకోవాలి.
 • తరువాత ఆ నీటితో స్నానం చేయాలి.
 • ఈ విధంగా రోజూ చేయడం వలన శరీర దుర్వాసన దూరం అవుతుంది.

మరోపద్ధతి :

 • రెండు గ్లాసుల టమాటా జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల శరీర దుర్వాసన అరికట్టవచ్చు.

మరికొన్ని చిట్కాలు:

1. కనీసం రోజుకి ఒక్కసారి అయిన స్నానం చేయాలి.

2. ధరించిన దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతకాలి.

3. బిగుతుగా వస్త్రాలను ధరించదాదు. అదే విధంగా దూరప్రాంతాలు వెళ్ళేటప్పుడు షూస్‌ వేసుకోరాదు. టైట్‌ షూస్‌ ధరించడం వలన కాలికి గాలి తగలక బ్యాక్టీరియా ఏర్పడి దుర్వాసన వస్తాయి. అందువల్ల మరీ టైట్‌గా ఉండే వాటిని ధరించదాదు.

4. వత్తిడి, కోపాన్ని ఇలాంటి ఉద్రేకాలకు గురైనప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. అందువల్ల మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిది.

5. చెమట ఎక్కువగా పట్టేవారు సిల్క్‌, సింథటిక్ వస్త్రాలకు దూరంగా ఉండటం మంచిది. ఇవి ఇంకా ఎక్కువగా చెమట పట్టడానికి కారణమవుతాయి. అందువల్ల కాటన్‌ దుస్తులను వాడడం మంచిది.

6. శరీరానికి కావలసినంత మంచి నీటిని అందజేయడం ద్వారా శరీరంలోని హానికారక క్రిములను తొలగించడంలో నీరు అద్బుతంగా సహాయం చేస్తుంది.

English summary

How to avoid bad body odor. Some other causes of offensive body odor include poor hygiene, nutrient deficiencies, and gastrointestinal problems.