చిట్లిపోయిన జుట్టుతో బాధపడుతున్నారా ??

How to avoid split ends

05:53 PM ON 8th December, 2015 By Mirchi Vilas

How to avoid split ends

చాలామంది ఇటీవలా ఈ సమస్యతో బాదపడుతున్నారు. జుట్టు చిట్లి పోయి దానివల్ల జుట్టు ఎదగడం ఆగిపోతుంది. అంతే కాకుండా జుట్టు అందవిహీనంగా ముక్కలుముక్కలుగా చిరాకుగా కనపడుతుంది. సరైన పోషణ మరియు తేమ లేకపోవడం వలన జుట్టు చిట్లి పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది పొడవాటి జుట్టు కలిగిన వారిలో ఈ సమస్య వేదిస్తుంది. చాలామంది చిట్లిపోయిన జుట్టుని చివరలు కత్తిరించుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన జుట్టు చిట్లిపోయే సమస్య మరింత కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల అస్తమానం జుట్టుకి స్ప్లిట్స్ తీయడం మంచిది కాదు. దానివల్ల జుట్టు చిన్నదిగా అయిపోవడమే కాకుండా మరింత అధికంగా జుట్టు చిట్లిపోతుంది. ఈ సమస్యను అరికట్టడానికి కొన్ని రకాల పద్ధతులను అనుసరించడం వలన జుట్టు సమస్యను అరికట్టవచ్చు. ఇవి పాటించడం ద్వారా జుట్టు పొడవుగా అందంగా పెరుగుతుంది.

1/11 Pages

1. గుడ్డు మాస్క్‌

గుడ్డులో అధికంగా ప్రొటీన్స్‌ మరియు ప్యాటీ ఆసిడ్స్‌ ఉండడం వలన జుట్టుని ఆరోగ్యవంతంగా పెరగడంలో సహాయపడుతుంది. ఈ మాస్క్‌ జుట్టుని మృదువుగా మరియు వత్తైన జుట్టుని మీ సొంతం చేస్తుంది.

కావలసినవి:

  • గుడ్డు-1
  • ఆలివ్‌ ఆయిల్‌ -2 లేదా 3 టేబుల్‌ స్పూన్స్‌
  • తేనె-1 టేబుల్‌ స్పూన్‌

పాటించే విధానం:

  • గుడ్డులోని పచ్చసొనని తీసుకొని అందులో 2 లేదా 3 చుక్కల ఆలివ్‌ నూనె ఒక టేబుల్‌స్సూన్‌ తేనె కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని తడి తలకి రాసుకుని 30 నిమిషాలపాటు వదిలేయాలి.
  • అనంతరం తలని షాంపూతో శుభ్రంగా కడగాలి.

మరోపద్ధతి :

  • బాదం నూనెలో గుడ్డు కలుపుకుని తడి తలకి పట్టించి 20 నుండి 30 నిమిషాలు గడిచిన తరువాత తలకి స్నానం షాంపూతో చేయాలి.

English summary

Lack of proper nourishment and moisture can make the problem worse, particularly for those with long hair. To avoid split ends then follow these steps.