తిరుమల ఆన్ లైన్ సేవా టికెట్ల బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండిలా..

How to book Tirumala Seva tickets in online

11:41 AM ON 27th October, 2016 By Mirchi Vilas

How to book Tirumala Seva tickets in online

తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. కొందరు అప్పుడప్పుడు తిరుమల వెళ్తే, మరికొందరు ఎప్పుడు పడితే అప్పుడు వీలుచిక్కినప్పుడల్లా వెళ్తుంటారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఆన్ లైన్ ద్వారా సేవా టికెట్స్ లభ్యం కావడంతో చాలామంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. టీటీడీ సేవా ఆన్ లైన్ డాట్ కామ్... ద్వారా తిరుమల ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసుకునే సదుపాయం ఉంది. సుప్రభాతం, నిజపాద దర్శనం, తోమాల సేవ, అర్చన, విశేష పూజ, అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో కొనుగోలు చేయలేని వారు తిరుమలలో ఒక రోజు ముందు తదుపరి రోజుకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను పొందే అవకాశం కూడా ఉండనే ఉంది. ఇందుకోసం కొన్ని టికెట్లను కేటాయించారు. వీటిలో సుప్రభాతం టికెట్లను 100 కేటాయిస్తారు. అలాగే, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంత్సోతవం, సహస్ర దీపాలంకరణ సేవ, నిజపాద దర్శనం, విశేష పూజ, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ సేవ టికెట్లలోనూ కరెంట్ బుకింగ్ కోటా ఉంది. ఏ సేవకు ఎన్ని టెకెట్లను ఆన్ లైన్, కరెంట్ కోటాలో పొందవచ్చనేది, సేవల రుసుములను టీటీడీ లింక్ http://www.tirumala.org/Advancebooking.aspx ద్వారా తెలుసుకోవచ్చు. ఇక వివిధ రకాల దర్శనాలు వున్నాయి.

తిరుమలకు నిత్యం లక్ష మంది లోపు భక్తులు వస్తుంటారు. స్వామి వారిని రోజులో 40 వేల నుంచి 80వేల మంది వరకు దర్శించుకుంటుంటారు. ఇంత మందికి దర్శనం కల్పించడం సులభ విషయమేమీ కాదు.

1/6 Pages

సర్వదర్శనం...


స్వామి వారిని రూపాయి ఖర్చు లేకుండానే దర్శించుకునే అవకాశాన్ని సర్వదర్శనం కల్పిస్తుంది. అయితే ఎక్కువ మంది భక్తులు సర్వ దర్శనాన్ని ఆశ్రయిస్తుంటారు కనుక స్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. సాధారణ రోజుల్లో సర్వ దర్శనం భక్తులకు రోజులో 18 గంటలు కేటాయిస్తుంటారు. ప్రత్యేక పర్వ దినాలు, ఉత్సవ సమయాల్లో ఈ సమయం తగ్గుతుంది. సర్వదర్శనం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక్కో కంపార్ట్మెంట్ వారీగా భక్తులను దర్శనానికి విడుదల చేస్తారు. క్యూ కాంప్లెక్స్ లలో ప్రతి మూడు గంటలకోసారి ఉచితంగా పాలు, టీ, కాఫీ, అన్న ప్రసాదాన్ని అందిస్తారు. మధ్య మధ్యలో టాయిలెట్స్ కూడా ఉన్నాయి.

English summary

How to book Tirumala Seva tickets in online