ట్రైల్ రూంలో సీక్రెట్ కెమెరాను కనిపెట్టండిలా..(వీడియో)

How to detect hidden cameras in trail room

04:18 PM ON 7th September, 2016 By Mirchi Vilas

How to detect hidden cameras in trail room

ఒకప్పుడు షాపింగ్ కి వెళ్తే, ముఖ్యంగా కొత్త బట్టలు కొనడానికి ఫ్రెండ్స్ తో గాని, ఫ్యామిలీతో గాని సరదాగా షాపింగ్ కు వెళ్తే, బట్టలు ఎంచుకుని, తెచ్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఆతర్వాత కొన్ని రకాల షాపుల్లో డ్రెస్ వేసుకుని చూసుకునే వెసులు బాటు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం దాదాపు అన్నిచోట్లా కనిపిస్తోంది. ఇక కొత్త కొత్త బట్టలు ట్రై చేసి.. అందులో బాగా నచ్చినవి కొనుగోలు చేస్తాం. ఇంత వరకు బానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తరువాత మీరు ట్రయల్ రూమ్ లో కొత్త బట్టలు ట్రై చేసేటప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్ లో వస్తే దానిని మించిన షాక్ మరొకటి ఉండదు.

షాపింగ్ చేసిన సరదా కాస్తా, మీకు పీడకలగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య ఆడవారి మానం విషయంలో ఎన్నో గోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాలు ఆ షాపు యజమానులకు కూడా తెలిసుండకపోవచ్చు. అద్దం వెనకాల అమర్చిన హిడెన్ కెమెరాల సాయంతో మహిళలు వస్త్రాలు మార్చుకునే సమయంలో వారిని షూట్ చేసి.. ఆ వీడియోలను ఇంటర్నెట్ లో పెట్టడం, ఇతరులతో పంచుకోవడం, అ మహిళను బ్లాక్-మెయిల్ చేయడం వంటివి చేస్తున్నారు. అందుకే ఇలాంటి దారుణాల నుండి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకు ఈ వీడియో కొంతవరకూ ఉపయోగపడుతుంది. అదేంటో చూద్దాం.

1/5 Pages

1. ట్రయల్ రూమ్ లో హిడెన్ కెమెరా ఉంటే, మీ ఫోన్ ద్వారా ఎవరికైనా కాల్ చేసి చూడండి. ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం వచ్చినా, కాల్ డ్రాప్ అయినా అక్కడ ఏదో అపాయం ఉన్నట్టేనని గుర్తించవచ్చు.

English summary

How to detect hidden cameras in trail room