వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే, బతికి బయట పడే మార్గం ఇదే

How to escape from rain floods

11:47 AM ON 21st July, 2016 By Mirchi Vilas

How to escape from rain floods

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, ప్రకృతి విపత్తులనేవి చెప్పి రావన్న విషయం అందరికీ తెల్సిందే. అవెప్పుడు వచ్చినా చెప్పకుండానే వస్తాయి. అలా వచ్చే క్రమంలో ఎంతో మందిని తమతో తీసుకుపోతాయి. ముఖ్యంగా వరదలు వచ్చినపుడు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఎందుకంటే, ఉత్తరాఖాండ్ వరద భీభత్సంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఎక్కడైనా సరే, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఎవరైనా చిక్కుకుంటే ప్రాణాలకే ప్రమాదం. అలాంటి వారి పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ క్రమంలో అలాంటి అపాయ పరిస్థితిలో చిక్కుకున్న వారు బతికి బట్ట కట్టడమంటే చాలా కష్టమే. అయితే అలాంటి వరదలు వచ్చినప్పుడు ఓ సూచన పాటిస్తే అధిక శాతం వరకు మన ప్రాణాలను రక్షించుకోవచ్చట.

1/2 Pages

అదెలాగంటే..!

సాధారణంగా నీటికి ప్రవహించినా, ప్రవహించకున్నా ఎంతో కొంత ఫోర్స్(బలం) ఉంటుంది. అయితే మనిషి కన్నా నీటి పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ నీరు ఆ మనిషిని తోసేస్తుంది. అది ఎంత వేగంగా ప్రవహించినా సరే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఆ నీటి వేగం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంత మంది మనుషులు ఆ నీటి ప్రవాహంలో ఉన్నా కొట్టుకుపోతారు. అయితే ఆ నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో బలాన్ని కలిగిస్తే అప్పుడు అందులో మనుషులు ఉన్నా వారికి ఏమీ కాదు. ఆ బలం ఎలా వస్తుందంటే, మనుషులంతా ఒకరి వెనుక ఒకరు సందు లేకుండా గట్టిగా పట్టుకుని నిలబడితే చాలు.

దాంతో ఆ మనుషుల బలమంతా కలిసి నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా పనిచేస్తూ దాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ప్రవాహ వేగం తగ్గగానే మనుషులు బతికి బయట పడవచ్చు. అయితే అదే మనుషులు పక్క పక్కనే ఉంటే మాత్రం అంత బలం రాదు. ఒకరి వెనుక ఒకరు ఉండాల్సిందే. అప్పుడే నీటికి అడ్డుగోడలా ఏర్పడుతుంది. ఈ సూచనను వరద ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు అమలు చేస్తే, సులభంగా బయట పడవచ్చు. ఇక ఈ పద్ధతిని కొందరు ప్రయోగశాలలో పరీక్షించి మరీ విజయవంతమయ్యారు. వారి పరీక్షకు చెందిన వీడియో కూడా ఓ సారి వీక్షిస్తే, వరదలలో బతికి ఎలా బయట పడవచ్చో అర్ధం అవుతుంది.

English summary

How to escape from rain floods