నెలరోజుల్లో బరువు పెరగడం ఎలా?

How to gain weight

06:30 PM ON 15th December, 2015 By Mirchi Vilas

How to gain weight

ఇటీవల చాలా మంది రెండు సమస్యలకు గురవుతున్నారు. ఒకటి బాగా లావుగా  ఉండి ఎలా సన్నబడాలా అని. ఇంకొకటి బాగా సన్నగా ఉండి ఎలా లావు అవ్వాలా అని, ఈ రెండు ప్రశ్నలు యువతను వెంటాడుతున్నాయి. లావుగా ఉన్న వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు, సన్నగా ఉన్నవారంతా నీరసంగా ఉన్నారని కాదు. ఎవరి శరీరతత్వం వారిది. మీరు ఒకవేళ లావుగా లేదా సన్నగా అవ్వాలి అనుకుంటే కుత్రిమ పద్దతులలో కాకుండా సహజసిద్దమైన పద్దతులను ఆచరించి సన్నబడడం లేదా లావు అవడం చేయాలి.

1/7 Pages

1. సహజ పద్దతులను పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు మీ దరిచేరవు. బరువు పెరగాలి అనుకునేవారు ఎలాగోలా బరువు పెరగాలి అనుకోకూడదు. ఏవి పడితే అవి తినేస్తే బరువు పెరుగుతారు, అలాగే వాటితో పాటు అనారోగ్యపాలు అవుతారు. బయట దొరికే జంక్‌ఫుడ్‌ తినడం వలన త్వరగా లావవుతారు కాని దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా మంచిది. దానివల్ల ఆరోగ్యకరంగా ఉంటారు. ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో ఎలా తీసుకోవాలో చూద్దాం.కొన్ని పద్దతులను అనుసరించడం ద్వారా సహజంగా బరువు పెరగవచ్చు. ఈ పద్దతులను పాటించడం ద్వారా కేవలం నెల రోజులలో బరువు పెరగవచ్చు.

English summary

Being underweight can make you vulnerable to illness. To gain weight you will need to eat more calories than you burn daily.