సులభంగా సిక్స్ ప్యాక్ పొందడం ఎలా?

How to get six pack easily

11:52 AM ON 9th July, 2016 By Mirchi Vilas

How to get six pack easily

ఒక్కో కాలంలో ఒక్కోటి ప్రాచుర్యం ఉంటుంది. దాని మీదే మోజు పెరిగిపోతుంది. ఇక ప్రస్తుత కాలంలో చూస్తే, యువకులు సిక్స్ ప్యాక్ ఆబ్స్ పై మోజు కనబరుస్తున్నారు. సినీ హీరోలు సైతం ఈ మధ్య సిక్స్ ప్యాక్ మీద శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక కఠినమైన ఆబ్స్ అంటే చాలు ఈ కాలం యువతలో తెలియని ఆనందం. ఇంకా చెప్పాలనే అదోరకమైన పిచ్చి కూడా. అయితే సులభంగా సిక్స్ ప్యాక్ పొందవచ్చని అంటున్నారు. అదెలాగో చూద్దాం.

సిక్స్ ప్యాక్ ఆబ్స్ పొందడానికి రహస్యమైన పద్ధతి అంటూ ఏమీ లేదు. కొన్ని పద్ధతులను అనుసరిస్తూ, సులువుగా సిక్స్ ప్యాక్ ఆబ్స్ పొందవచ్చు. చాలా మందికి వారి విధుల వల్ల తగినంత సమయం దొరకకపోవడంవల్లే  శరీరంపై శ్రద్ధ వహించలేకపోతున్నారు కానీ, అలవాట్లలో కొన్ని మార్పులను చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని అంటున్నారు నిపుణులు. కొద్దిపాటి వ్యాయామాలతో, తినే అలవాట్లని మార్చుకుంటే చాలట. ఆబ్స్ పొందుటకు అలవాట్లలో చేయాల్సిన మార్పుల గురించి తెలుసుకుందాం.

1/7 Pages

కోర్ కండరాలపై వ్యాయామం...

సిక్స్ ప్యాక్ ఆబ్స్ పొందడానికి చేయాల్సిందేమిటంటే, పొట్టపై కొవ్వుని తీసివేస్తేచాలని అంటున్నారు. ఒక్కసారి మీ ఉదరంపై కొవ్వుని తొలగించుకోగానే ఫోర్ ప్యాక్, సిక్స్ ప్యాక్ లేదా ఎయిట్ ప్యాక్ తెచ్చుకోవచ్చు. మొదట కోర్ కండరాలపై వ్యాయామం మొదలుపెట్టాలి. రివర్స్ క్రంచెస్ వల్ల మీ కింద అబ్స్ బలపడుతాయి. రివర్స్ క్రంచెస్ అంటే క్రంచెస్లగానీ, కాళ్ళని మీదకు లేపాలి. మొదట కింద పడుకొని మీ చేతులని అర చేతులు కిందకు ఉండేలా కింద పెట్టాలి. తరువాత మీ కాళ్ళను పైకి తల వైపు లేపి కొంచం సేపు ఆపి మళ్ళీ కిందకు పెట్టండి. అవసరమైతే, ప్లాంక్ సహాయం కూడా తీసుకోవచ్చు.

English summary

How to get six pack easily