మృదువైన చేతుల కోసం 4 మార్గాలు

How to get soft and Beautiful Hands

12:57 PM ON 12th January, 2016 By Mirchi Vilas

How to get soft and Beautiful Hands

సాదారణంగా ప్రతి ఒక్కరు ముఖం మీద పెట్టిన శ్రద్ధను చేతుల మీద పెట్టరు. అందువల్ల మనం చేతులను మృదువుగా మరియు అందంగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. మన చేతులకు వృద్దాప్య లక్షణాలు వచ్చినప్పుడు సాగినట్టు అన్పిస్తాయి. కేవలం చేతులు మాత్రమే వృద్ధాప్యం యొక్క తీవ్రమైన సంకేతాలను చూపుతుంది. సాదారణంగా చేతులను వంట సామాను తోమటం, బరువులు ఎత్తడం, డ్రైవింగ్ వంటి వాటిని చేయటం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అందువల్ల కొన్ని ప్యాక్స్ చేతులకు వేసుకుంటే మంచిది.

బట్టలు ఉతికినప్పుడు,వంట సామాను తోమినప్పుడు, కఠినమైన రసాయనాలు మరియు డిటర్జెంట్ల నుండి చేతులను రక్షించుకోవటానికి  చేతి తొడుగులను  (గ్లౌజ్) ఉపయోగించాలి. ఈ  చేతి తొడుగులను వేసుకోవటానికి ముందు చేతులకు ఆలివ్ ఆయిల్ లేదా హోం మెడ్ క్రీం రాసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చేతులు మృదువుగా మారతాయి. చేతులు కఠినమైన, పొడిగా, ముడుతలు,లైన్స్ వంటివి లేకుండా ఉండాలంటే కొన్ని ప్యాక్స్, క్రీమ్స్ రాసుకోవాలి.  ఇప్పుడు వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

1/5 Pages

1. చేతి స్క్రబ్

మృదువైన మరియు అందమైన చేతుల కోసం చక్కెర మరియు ఆలివ్ నూనెతో మనం సొంతంగా ఇంటిలోనే చేతి స్క్రబ్ తయారుచేసుకోవచ్చు.  ఆలివ్ నూనె,తీపి బాదం నూనె, జోజోబ నూనెలలో ఏ నూనెను అయిన ఉపయోగించవచ్చు. ఒకవేళ మనకు నూనె అందుబాటులో లేకపోతే నిమ్మరసంను ఉపయోగించవచ్చు. నిమ్మరసంలో పంచదార వేసి స్క్రబ్ గా తయారుచేసుకోవచ్చు.

కావలసినవి

  • ఆలివ్ నూనె - 1 స్పూన్
  • చక్కెర - 2 స్పూన్స్
  • నిమ్మ రసం - కొంచెం  ( చర్మం టోన్ తేలికగా ఉండి, చేతులు నిస్తేజంగా
  • కనపడితే ఉపయోగించండి)

పద్దతి

1. ఒక బౌల్ లో ఆలివ్ నూనె, చక్కెర, నిమ్మరసం( అవసరమైతే) వేసుకొని బాగా కలపాలి.
2. ఈ చేతి స్క్రబ్ ని నిదానంగా చేతి వేళ్ళ మధ్య,అరచేతులు,మొత్తం చేయి అంతా రాసి 2 నుంచి 3 నిముషాలు మర్దన చేయాలి.
3.  ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకుంటే మృదువైన మరియు అందమైన చర్మం సొంతం అవుతుంది.
4. చేతులను శుభ్రం చేసుకోవటానికి సబ్బు లేదా హ్యాండ్ వాష్ ఉపయోగించకూడదని గుర్తు పెట్టుకోవాలి.

English summary

4 steps to get soft and Beautiful Hands.I am sure we all heard that when it comes to age the back of our hands start sagging.