గులాబి రంగు పెదాల కోసం

How to get soft pink lips naturally

06:40 PM ON 4th December, 2015 By Mirchi Vilas

How to get soft pink lips naturally

మీ పెదాలు పొడిబారిపోయి నల్లగా ఉన్నాయా ? దీనికి కారణం పెదవులపై ఏర్పడిన మృతకణాల వల్ల పెదాలు నల్లగా మారిపోయి జీవంలేనట్లు ఉంటాయి. దీనికి చింతించాల్సిన అవసరం లేదు. పెదాల పై పేరుకు పోయిన మృతకణాలను మృదువుగా తొలగించడం ద్వారా తిరిగి రంగును సంతరించుకోవచ్చు. సున్నితమైన, మృదువైన, గులాభి రంగు పెదాల కోసం కొన్ని సాధారణ హోమ్‌ రెమిడీస్‌ ఉన్నాయి. ఆ చిట్కాలను ఎలా, ఎప్పుడు మరియు ఎంత మోతాదులో వాడాలో ఇప్పుడు చూద్ధాం.

పెదాల రంగు మారడానికి గల కారణాలు:

పెదాలు చాలా సున్నితమైనవి. వీటిపై వత్తిడి పెట్టరాదు. కొంత మంది పెదాలను కొరుకుతూ ఉంటారు. దీనివల్ల అవి వత్తిడికి గురై నల్లగా మారుతాయి. అంతేకాకుండా కెఫిన్‌ ఎక్కువగా తాగడం, సూర్యరశ్మి వలన, కాలుష్యం మరియు దూమపానం వల్ల పెదాలు పొడిబారి నల్లగా మారుతాయి.

గమనిక : ఈ చిట్కాలను వాడే ముందు మీ చర్మానికి సరిపోతాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి. ఇలా చేయకుండా డైరెక్ట్‌గా వాడితే ఏమైనా అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ముందుగా టెస్ట్‌చేసుకుని మీకు నచ్చిన చిట్కాని వాడి మంచి ఫలితాన్ని పొందండి.

1. లిప్‌బామ్‌ మరియు టూత్‌ బ్రష్‌

కావలసినవి:

 • లిప్‌బామ్‌
 • మృదువైన టూత్‌ బ్రష్‌

పాటించే పద్ధతి:

1. లిప్‌బామ్‌ ని పెదాలకు రాసుకోవాలి. దీనిని పెదాలకి రాసుకోవడం వలన చర్మం పై మృతకణాలు బాగా నాని మెత్తగా అవుతాయి.

2. కొంత సమయం గడిచిన తరువాత మృదువైన పళ్ళు కలిగిన బ్రష్‌తో పెదాలను వలయాకారంలో మసాజ్‌ చేసుకోవాలి.

3. ఇప్పుడు గోరు వెచ్చని వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి పెదాలను మృదువుగా తుడుచుకోవాలి.

4. పెదాలు పొడిబారి నట్లు అనిపిస్తే పల్చగా లిప్‌బామ్‌ ని రాసుకోవాలి.

5. ఈ విధానాన్ని వారానికి ఒకసారి చేయడం వలన పెదాలు మంచి రంగును సంతరించుకుంటాయి.

6. ఈ చిట్కావల్ల మృతకణాలు తొలగిపోయి పెదాలు మృదువుగా మారతాయి.

2. తేనె మరియు నిమ్మరసం

కావలసినివి:

 • తేనె -1 టీ స్పూన్‌
 • నిమ్మరసం -1/2 టీ స్పూన్‌

పాటించే పద్ధతి:

1. తేనెలో 1/2 టీ స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి.

2. ఈ ప్యాక్‌ని పెదాలకు వేసుకుని 15 నిమిషాలపాటు ఉంచుకోవాలి.

3. 15 నిమిషాల తరువాత మెత్తటి వస్త్రంతో పెదాలను తుడుచుకుని, మాయిశ్చరైజర్‌ ని పెదాలకు రాసుకోవాలి.

4. ఈ చిట్కాని ప్రతి రోజూ పాటించడం వలన మంచి పింక్‌ లిప్స్‌ని పొందుతారు.

5. ఈ ప్యాక్‌ వేసుకోవడం వలన పెదాలు నలుపు రంగు నుండి క్రమక్రమంగా గులాభి రంగులోకి మారతాయి.

3. ఆలివ్‌ ఆయిల్‌ మరియు పంచదార

కావలసినవి:

 • ఆలివ్‌ ఆయిల్‌ - 1 టేబుల్‌స్పూన్‌
 • పంచదార - 1 టేబుల్‌స్పూన్‌

పాటించే పద్ధతి:

1. పంచదార, ఆలివ్‌ ఆయిల్‌ రెండిటినీ బాగా కలపాలి.

2. కలిపిన మిశ్రమాన్ని పెదాలకి రాసుకొని వలయాకారంలో మసాజ్‌ చేసుకోవాలి.

3. కొంత సమయం గడిచిన తరువాత మెత్తటి వస్త్రంతో పెదాలను తుడుచుకోవాలి. ఆరిన పెదాలకు లిప్‌బామ్‌ రాసుకోవాలి.

4. ఈ విధంగా వారానికి 1 లేదా 2 సార్లు చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

4. అలోవెరా జెల్‌

కావలసినవి:

 • అలోవెరా ఆకు -1

పాటించే పద్ధతి:

1. అలోవెరా పై పచ్చని తొక్కని తీసివేయాలి.

2. అలోవెరా జెల్‌ని తీసి ఒక కంటైనర్‌లో నిల్వచేయాలి.

3. ఈ జెల్‌ ని ఫ్రిజ్‌ లో నిల్వచేసుకోవచ్చు.

4. ప్రతిరోజూ లిప్‌బామ్‌ లాగా ఈ జెల్‌ని రాసుకోవాలి. రోజులో ఒకసారి కాకుండా వీలుకుదిరినప్పుడల్లా రాసుకోవడం వల్ల మృదువైన పెదాలను పొందుతారు.

5. అలోవెరాలో మంచి ఔషద గుణాలు ఉన్నాయి. అందువల్ల పగిలిన పెదాలను బాగుచేస్తుంది. అంతే కాకుండా కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేస్తుంది.

5. దానిమ్మరసం

కావలసినవి:

 • దానిమ్మ గింజలు - 1 కప్పు

పాటించే పద్ధతి:

1. దానిమ్మ గింజలను మిక్సీ లో వేసి జ్యూస్‌ చేసుకోవాలి.

2. వచ్చిన మిశ్రమాన్ని వడకట్టి పప్పుని వేరుచేసుకోవాలి.

3. దానిమ్మ జ్యూస్‌ లో దూదిని ముంచి పెదాలకు రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వలన మంచి రంగుని పొందుతారు.

4. దానిమ్మ జ్యూస్‌ ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవచ్చు.

6. గులాభి రేకులు

కావలసినవి:

 • గులాభి రేకులు - 6
 • పాలు - 1/2 కప్పు

పాటించే పద్ధతి:

1. పాలల్లో గులాబి రేకులను రాత్రంతా నానపెట్టాలి.

2. మరుసటి రోజు గులాభి రేకులను బాగా మెత్తగా రుబ్బుకోవాలి.

3. వచ్చిన పేస్ట్‌లో కొన్ని చుక్కలు పాలు కలిపి పెదాలకు రాసుకోవాలి.

4. ఇలా రోజూ చేయడం వలన అద్బుతమైన ఫలితాన్ని పొందుతారు.

5. పాలలో బ్లీచింగ్‌ గుణాలు, గులాభి రేకులలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వలన పెదాలను కాంతివంతంగా చేసి మరియు సహజసిద్ధమైన రంగుని అందిస్తాయి.

7. చాక్లెట్‌ లిప్‌బామ్‌

కావలసినవి :

 • కోకోబట్టర్‌ - 1 టీ స్పూన్‌
 • చాక్లెట్‌ చిప్స్‌ - 1/2 టీ స్పూన్‌
 • విటమిన్‌ ఇ - 1 క్యాప్సుల్‌

పాటించే పద్ధతి :

1. కోకోబట్టర్‌ లో చాక్లెట్‌ చిప్స్‌ ని కరిగించి వేయాలి. తరువాత రెండిటినీ వేడి చేయాలి.

2. వేడి చేసిన మిశ్రమంలో విటమిన్‌ ఇ క్యాప్సుల్‌ని కలపాలి. ఇప్పుడు చాక్లెట్‌ లిప్‌బామ్‌ రెడీ అయింది.

3. దీనిని ఒక కంటైనర్‌ లోకి తీసుకొని ఆరనివ్వాలి.

4. ఈ బామ్‌ని పెదాలు ఎండినప్పుడల్లా రాసుకోవడం వలన మంచి రంగుతోపాటు, మెరుపును కూడా సంతరించుకుంటాయి.

8. గ్లిసరిన్‌ మరియు నిమ్మరసం

కావలసినవి :

 • గ్లిసరిన్‌ -2 నుండి 3 చుక్కలు
 • నిమ్మరసం - 2నుండి 3 చుక్కలు

పాటించే పద్ధతి :

1. గ్లిసరిన్‌ మరియు నిమ్మరసాన్ని ఒక కంటైనర్‌ లో తీసుకొని బాగా కలపాలి.

2. పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకొని పడుకోవాలి.

3. నిమ్మరసంలొ బ్లీచింగ్ గుణాలు ఉండడం వలన పెదాలపై మురికిని తొలగించి పెదాలు రంగుని సంతరించుకునేలా చేస్తుంది. గ్లిజరిన్‌ సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

9. కొత్తిమీర లిప్‌బామ్‌

కావలసినవి :

 • కొత్తిమీర - 3 నుండి 4 ఆకులు

పాటించే విధానం :

1. కొత్తిమీర ఆకులని బాగా పేస్ట్‌లా చేసుకొని పెదాలకి రాసుకోవాలి.

2. 30 నిమిషాలు గడిచిన తరువాత మెత్తని వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి.

3. ఈ విధంగా రోజూ చేయడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

సరైన పద్ధతిలో జాగ్రత్తలు తీసుకోవడం వలన మృదువైన, సున్నితమైన పెదాలను మీ సొంతం చేసుకోవచ్చు.

English summary

How to get soft pink lips naturally. A few simple home remedies are all you need to get softer, smother and pinker lips