మీ ప్రియుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడో లేక నటిస్తున్నాడా తెలుసుకోండిలా..

How to know that your crush is loving really or not

03:58 PM ON 16th August, 2016 By Mirchi Vilas

How to know that your crush is loving really or not

సృష్టిలో ప్రతీ జీవికి ప్రేమ సహజం. పుట్టిన ప్రతీ ఒక్కరు ఎవరో ఒకరిని ప్రేమిస్తారు. ప్రేమించకపోతే ఆ బ్రతుక్కి అర్ధమే ఉండదు. అయితే రానురాను ప్రేమలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకరి ప్రాణం ఒకరు తీస్తున్నారు. అయితే ఇప్పటికీ గొప్ప ప్రేమ కొంత మందిలో బ్రతికే ఉంది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే కానీ ప్రేమికుల్లోనే ఎధవలు ఉంటారు అనడంలో తప్పు లేదు. ఇందులో ఆడ, మగ అని తేడా లేదు. ఆడవాళ్లు మోసం చెయ్యొచ్చు, మగ వాళ్ళు మోసం చెయ్యొచ్చు. అయితే ఇక్కడ ఎక్కువ శాతం మగ వాళ్లలోనే మోసం చేసే వాళ్ళు ఉన్నారు.

అయితే ఈ సమాజంలో తప్పు మగవాడు చేసినా ఆడది చేసినా ఆడదాన్నే నింధిస్తారు. కాబట్టి మీ ప్రియుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోడానికి అతను మీకు 'ఐ లవ్ యూ' అని చెప్పనసరం లేదు. 'ఐ లవ్ యూ' చెప్పకుండానే అతనిలోని భావాన్ని ఈ మార్పులతో గమనించవచ్చు. అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేక నటిస్తున్నాడా అని ఈ మార్పుల ద్వారా తెల్సుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

1/7 Pages

మీరు చాలా కాలం క్రితం మర్చిపోయిన చిన్నచిన్న విషయాలను అతడు గుర్తు చేస్తే అతడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లు అర్ధం. ఉదాహరణకు మీకు నచ్చిన రంగు, సినిమా, హీరో, హీరోయిన్, మొదటి పరిచయంలో మీరు తెలిపిన విషయాలు, మీ పుట్టిన రోజుకి మీకు ఏమి కావాలో, అతనికి మీరు చెప్పిన చిన్ననాటి జ్ఞాపకాలు.. ఇలాంటివి మీకు గుర్తు చేసినట్లయితే అతడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నట్లే అని తెలుసుకోండి.

English summary

How to know that your crush is loving really or not