రెండవ బిడ్డను ప్లాన్ చేస్తున్నారా????

How to Planning for a Second Baby

11:27 AM ON 7th January, 2016 By Mirchi Vilas

How to Planning for a Second Baby

మొదటి సారి గర్భాదరణ అనేది చాలా సులువుగానే ఉంటుంది. కానీ రెండో సారి కూడా అదే విధంగా ఉంటుందని ఆశించకూడదు. ఎందుకంటే రెండో సారి గర్భాదరణ జరిగినప్పుడు శరీరం, శక్తి స్థాయిలు మరియు హార్మోన్లు మొదలైన వాటిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. అంతేకాక ఇది మన శరీరానికి సరి కొత్త సవాలు అని చెప్పవచ్చు. రెండవ బిడ్డను ప్లాన్ చేసినప్పుడు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకుంటే గర్భాదరణ అనేది చాలా సులువుగానే ఉంటుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

1/7 Pages

1. రక్త పరీక్ష చేయించుకోవాలి

రెండవ బిడ్డ కోసం ప్లాన్ చేసినప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా డాక్టర్ ని అడగాలి. గర్భ నిర్ధారణ పరీక్షతో పాటు, ఇనుము స్థాయిలను కూడా పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే రెండవ గర్భధారణ సమయంలో ఇనుము లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇనుము అనేది గర్భధారణ సమయంలో ఒక ముఖ్యమైన పోషకంగా ఉంది. అది ఎలా అంటే తల్లి, శిశువు మరియు మావి కోసం ఎర్ర రక్త కణాలను ఏర్పాటు చేయటానికి సహాయపడుతుంది.  గర్భధారణ సమయంలో పిండం యొక్క అవసరాలు మరియు గర్భవతి శరీర అవసరాల కొరకు  50 శాతం కంటే ఎక్కువ రక్తం అవసరం అవుతుంది. ఇనుము లోపంతో బాధపడితే రక్త హీనత, ముందుగానే డెలివరీ అవటం మరియు  శిశువు రక్తహీనతకు దారి తీస్తుంది. కాబట్టి ఈ సమస్యల నుండి బయట పడాలంటే ఇనుము ఉన్న ఆహారాలను సమృద్దిగా తీసుకోవాలి.

English summary

So, if you are planning a second baby, here are a few things you should do to gear up for conception and make your pregnancy smooth sailing.