మస్కారాను తయారుచేసుకునే విదానం

How to prepare mascara at home

01:32 PM ON 27th January, 2016 By Mirchi Vilas

How to prepare mascara at home

మస్కారాను ఇంటిలో ఎలా తయారు చేయాలా అని ఆలోచనలో పడ్డారా? దీనిని ఖచ్చితంగా ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. ఇకపై సౌందర్య స్టోర్ వద్ద చాలా ఖరీదైన మస్కారాను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. చాలా సులువుగా ఇంటిలో తయారుచేసుకోవచ్చు.

ఇంటిలో తయారుచేసుకొనే సేంద్రీయ మస్కారా వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే కళ్ళకు మరింత అందాన్ని మరియు ఆకర్షణను జోడిస్తుంది. కళ్ళకు మస్కారా రాసినప్పుడు ఒక అందమైన ఆకృతిని సృష్టిస్తుంది.

కావలసినవి

  • బ్లాక్ మినరల్ పౌడర్
  • బెంటోనైట్ బంకమట్టి - ఇది మస్కారా గట్టిపడకుండా నిరోదించటానికి మరియు ముదురు రంగు రావటానికి
  • కలబంద - సున్నితత్వం మరియు ఒక అందమైన నిర్మాణం సృష్టించడానికి
  • లావెండర్ నూనె - మంచి సువాసన ఇవ్వటానికి మరియు కనురెప్పల పెరుగుదలకు ఒక సాధారణ మాస్కరా కంటైనర్
  • ఒక చిన్న గరిటె
  • సాధారణ ఔషధ డ్రాపర్
1/4 Pages

పద్దతి

* ఒక గిన్నెలో బ్లాక్ మినరల్ పౌడర్,బెంటోనైట్ బంకమట్టి, లావెండర్ నూనె వేసి మిశ్రమం మృదువుగా అయ్యే వరకు బాగా కలపాలి.
* దానికి స్థిరత్వం సృస్టించటానికి కలబంద జెల్ ని వేసి బాగా కలపాలి.
* ఆ తర్వాత ఒక గరిటె సాయంతో ఔషధ డ్రాపర్ తో మస్కారాను నిదానంగా మాస్కరా కంటైనర్ లోకి వేయాలి.
* అలాగే మరొక పద్ధతిని కూడా ప్రయత్నించవచ్చు. ఒక ట్యూబ్ లో అన్ని పదార్దాలను వేసి బ్రష్ సాయంతో కలపాలి. దీనికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఓపికగా వెయిట్ చేయాలి.
* ఈ విధంగా తయారుచేసుకున్న మస్కారాను ఒక సాధారణ మస్కారాను ఎలా ఉపయోగిస్తామో అలాగే ఉపయోగించాలి.
* మస్కారాను తొలగించటానికి వెచ్చని నీరు లేదా ఆలివ్ నూనె లో ముంచిన కాటన్ వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఇది సహజమైన కంటి మేకప్ రిమూవర్ గా పనిచేస్తుంది.

English summary

Here are the some beauty tips. That is how to make mascara at home. These homemade mascara recipes are easy to do, and they promise to last very long. once you try surely you get best mascara at home