కంటికింద వలయాలకి చెక్‌

How to prevent dark circles

05:16 PM ON 18th December, 2015 By Mirchi Vilas

How to prevent dark circles

కంటి కింద వలయాలతో బాధపడుతున్నారా? కలత చెందవలసిన అవసరం లేదు. కంటి కింద నల్లని వలయాల కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి సులభంగా ఈ సమస్యను ఎదుర్కొనవచ్చు. వత్తిడి, నిద్రలేమి వలన ఈ సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా సరైన పోషకాహారం శరీరానికి లభించనప్పుడు కూడా శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల సమయానికి తిని సమయానికి పడుకోవడం ఉత్తమం. ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొనే చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ పద్దతులను పాటించేటప్పుడు ఎంచుకున్న పదార్ధాలను కంటిలోపలికి పోకుండా జాగ్రత వహించాలి.

ఈ కింది చిట్కాలలో మీకు నచ్చిన మరియు అందుబాటులో ఉన్న చిట్కాని వాడి మంచి ఫలితాన్ని పొందండి.

1/11 Pages

1. రోజ్‌వాటర్‌ మరియు పాలు

రోజ్‌వాటర్‌ మరియు పాలు కంటికింద నల్లని వలయాలను పోగొట్టడంలో అద్బుతంగా పనిచేస్తాయి. ఈ రెండిటి కలయిక కంటికింద పిగ్మెంటేషన్‌, ఇరిటేషన్‌ ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని వాడడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు కలుగవు.

కావలసినవి :

  • రోజ్‌వాటర్‌ - 1 టీస్పూన్‌
  • చల్లని పాలు - 1 టీస్పూన్‌
  • కాటన్‌ ప్యాడ్స్‌ - 2
  • చిన్నపాత్ర

పద్దతి :

  • ముందుగా పాత్రని తీసుకుని దానిలో పాలు, రోజ్‌వాటర్‌ ని వేసి బాగా కలపాలి.
  • తరువాత కాటన్‌ ప్యాడ్స్‌ తీసుకొని అందులో ముంచి 4 నుండి 5 నిమిషాలు ఉంచాలి.
  • 5 నిమిషాల తరువాత ఆ కాటన్‌ ప్యాడ్స్‌ని కళ్ళ పై పెట్టి 15 నుండి 20 నిమిషాలు ఉంచాలి.
  • ఈ విధంగా రోజుకి 2 లేదా 3 సార్లు చేయడం వలన నల్లని వలయాలు దూరం అవుతాయి.

English summary

To treat the dark color around the eyes the right solution for how to get rid of dark circle under eyes are face masks posted.