జట్టు రాలడాన్ని అరికట్టండిలా..

How to prevent hair loss

04:23 PM ON 17th December, 2015 By Mirchi Vilas

How to prevent hair loss

ఇటీవల జుట్టురాలే సమస్య అందరినీ వేధిస్తుంది. రోజులో 50 నుండి 100 వరకు జుట్టు రాలడం సహజమని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. 50 నుండి 100 వరకు వెంట్రుకలు రాలడం అందరిలో జరిగే చర్య అని దాని గురించి చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అంతకు మించి రాలితే జుట్టుకి నష్టం వాటిల్లినట్లేనని నిపుణులు తెలియజేసారు. చాలామందికి 30 సంవత్సరాలు దాటిన తరువాత జుట్టు రాలడం మొదలవుతుంది. హార్మోన్ల మార్పు వలన, ఒత్తిడి మరియు అనారోగ్యకారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అందువల్ల అలాంటి వారు చింతించాలివసన అవసరం లేదు కొన్ని చిట్కాలను పాటించడం వలన జుట్టురాలడాన్ని అరికట్టవచ్చు. అదే విధంగా తిరిగి మళ్ళీ వత్తుగా పెరగడానికి ఈ చిట్కాలు ఎంతగానో సహాయపడతాయి.

1/9 Pages

1. ఉసిరికాయలు

వీటిలో అధికంగా విటమిన్‌ సి నిండి ఉంటుంది. అంతేకాకుండా ఉసిరి లో యాంటీఆక్సిడెంట్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. అందువల్ల ఇది జుట్టురాలడాన్ని అరికట్టి వత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

  • ప్రతిరోజూ ఉసిరికాయ పొడిని జుట్టు కుదుళ్ళకు పట్టించడం వలన జుట్టు బలంగా తయారవుతుంది.
  • ఉసిరికాయ పొడి మార్కెట్లో కొనుగోలు చేసుకొని వాడవచ్చు.

మరొక పద్దతి

  • 2 టీస్పూన్స్‌ ఉసిరిపొడి తీసుకుని అందులో తగినంత నిమ్మరసాన్ని కలిపి తలకి రాసుకోవాలి. తల పూర్తిగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో తలని శుభ్రపరుచుకోవాలి.

English summary

Most people are likely to experience hair loss in their 30s because at this time, hormonal changes, stress and an unhealthy diet take their toll.