కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

How to Prevent Kidney Stones

06:35 PM ON 29th December, 2015 By Mirchi Vilas

How to Prevent Kidney Stones

మూత్రపిండాలు(కిడ్నీ)లో రాళ్ళూ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూత్రంలో కొన్ని రసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. సాదారణంగా ఈ రాళ్లు అనేవి కాల్షియం అక్సలేట్, ఫాస్పరస్ మరియు యూరిక్ ఆమ్లం వలన ఏర్పడతాయి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని మరియు 20 నుంచి 40 సంవత్సరాల లపు వారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని తెలిపింది.

సాధారణంగా చిన్న రాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గములో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు. అంతేకాక పెద్ద రాళ్ళ కారణంగా మూత్ర మార్గము కూడా దెబ్బతింటుంది.

మూత్రపిండాల్లోని రాళ్ళని కరిగించడానికి మరియు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎలాగో క్రింది స్లైడ్స్ లో చూద్దాం.

1/11 Pages

1. తగినంత నీటిని త్రాగాలి

తగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగటమే కాకుండా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తీసుకోవటం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు పంపుతాయి. ఎక్కువ ద్రవాలను త్రాగితే మూత్రపిండాలలో రాళ్ళ ప్రమాదం తగ్గుతుందని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ తెలిపింది. పెద్దవారు ప్రతి రోజు తప్పనిసరిగా 10 నుంచి 12 గ్లాసుల నీటిని త్రాగాలి. నీటిని ఎక్కువగా తీసుకోవటం వలన మూత్రపిండాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే నీరు ఎక్కువగా త్రాగటం లేదని అర్ధం. నీటితో పాటు నీరు సమృద్దిగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తీసుకోవాలి. లేదా శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచటానికి నారింజ రసం మరియు నిమ్మరసం త్రాగాలి.

English summary

Make sure to follow these steps to prevent your kidneys from stones. We know now a days more people suffering from kidney stones problem. Follow these simple steps to avoid this problem.